
గణ ఆగమనం!
మహాగణపతి.. గోమయ గణపతి
గణేశ్ విగ్రహాల తరలింపులో నయా ట్రెండ్ కనిపిస్తోంది. గతంలో అక్కడక్కడా కనిపించిన కల్చర్ ఇప్పుడు అంతటికీ పాకింది. నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాల్లో కొనుగోలు చేసిన బొజ్జ గణపయ్య విగ్రహాల తరలింపును వేడుకలా చేస్తున్నారు. డీజే చప్పుళ్లు, బాణసంచా పేలుళ్ల మధ్య.. డ్రెస్ కోడ్ పాటిస్తూ ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ గణేశ్ విగ్రహాలను మండపాల వద్దకు తీసుకెళ్తున్నారు. నిమజ్జన వేడుకల్లో కనిపించే సందడి గణనాథుడి ఆగమనం వేళ కనిపించడం విశేషం.
సాక్షి, వరంగల్: గ్రేటర్ వరంగల్‌తో పాటు జిల్లావ్యాప్తంగా వినాయకచవితి పండుగ సందడి మొదలైంది. వివిధ రూపాల్లో రూపుదిద్దుకున్న బొజ్జ గణపయ్య ప్రతిమలను పట్టణాలు, పల్లెల్లోకి తీసుకెళుతున్నారు. ప్రతిఏటా గణేశ్ నిమజ్జన వేడుకల్లో కనబడే సందడి ఈసారి గణేశ్ విగ్రహాలను ప్రతిష్ఠించడానికి ముందే కనబడుతోంది. గణేశ ఆగమన వేడుకల నిర్వహణతో భక్తులు గణనాథున్ని ఘనంగా మండపాలకు తీసుకెళుతున్నారు. వినాయక విగ్రహాలను తయారీదారుల నుంచి తాము ఏర్పాటుచేసిన మండపాల వద్దకు డప్పుచప్పుళ్లతో వేడుకగా తీసుకొస్తున్నారు. మహిళలు సంప్రదాయ హారతులతో స్వాగతిస్తుండగా, సంగీతం, నృత్యం, బాణాసంచా పేలుళ్లతో గణనాథుడిని వైభవంగా మండపాలకు తరలిస్తున్నారు. నిమజ్జన సందడికి ఏమాత్రం తీసిపోకుండా ఈసారి సరికొత్త సంప్రదాయంతో వినాయకుడి విగ్రహాలను తీసుకెళ్తుండడం గ్రేటర్ వరంగల్‌లో ఆకట్టుకుంటోంది. సామాజిక మాధ్యమాలు విస్తృతం కావడంతో ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో లైక్స్ కోసం కూడా కొంతమంది వినాయక ఆగమనమాన్ని వేడుకగా నిర్వహిస్తున్నారు. మూడు రోజుల నుంచే నగరంలో చాలా మంది గణనాథులను ‘గణేశ్ అగమనం’ వేడుకలతో మండపాలకు తీసుకెళ్తున్నారు. మహిళలు, పురుషులు ప్రత్యేక డ్రెస్ కోడ్‌లతో ఈ ఉత్సవానికి వన్నె తెస్తున్నారు. వరంగల్, హనుమకొండ, కాజీపేటలో ఈ గణేశ్ అగమన యాత్రల సందడి జోరుగా ఉంది. బుధవారం నుంచి తొమ్మిదిరోజుల పాటు వినాయక చవితి ఉత్సవాలు చేసేందుకు భక్తులు సిద్ధమయ్యారు.
మట్టి, గోమయ విగ్రహాలకే
జై కొడుతున్న భక్తులు
ఏళ్లుగా నవరాత్రి ఉత్సవాల నిర్వహణ
పర్యావరణానికి హాని కలగని
విధంగా పూజలు
నిమజ్జన సందడి మాదిరిగానే గణేశుడి స్వాగత వేడుక
సంగీతం, నృత్యం, బాణాసంచా
పేలుళ్లతో విగ్రహాల తరలింపు
డ్రెస్ కోడ్, డీజే చప్పుళ్ల మధ్య మండపాల వద్దకు..
గ్రేటర్ వరంగల్, పట్టణాల్లో నయా ట్రెండ్
నేడు కొలువుదీరనున్న గణపయ్య

గణ ఆగమనం!

గణ ఆగమనం!