
సందడే సందడి..
ఎంజీఎం సర్కిల్, రామన్నపేట, ఎంజీఎం సెంటర్, ఫోర్ట్ వరంగల్ ఏఎస్‌ఎం కాలేజీ సమీపంలో, నాగమయ్య గుడి సమీపంలో, నాయుడు పెట్రోల్ బంక్ సమీపంలో, ఎనుమాముల మార్కెట్ రోడ్డు, కోటిలింగాల గుడి సమీపంలో, లేబర్ కాలనీ, ధర్మారం తదితర ప్రాంతాల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయకులను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. చిన్న విగ్రహాల నుంచి పెద్ద విగ్రహాల వరకు రూ.500ల నుంచి రూ.లక్షల వరకు ఖరీదు చేస్తున్నారు. ‘ఈసారి పంచాయతీ ఎన్నికలు సమీపంలో ఉండడంతో చాలామంది విగ్రహ దాతలు ముందుకు వచ్చారు. గతం కంటే ఈసారి ఎక్కువ ఎత్తున్న వినాయక విగ్రహాలను తీసుకెళ్లేందుకు పోటీపడ్డారు. రేటు ఎక్కువైనా ఎక్కడా వెనుకాడడం లేదు’ అని ఎంజీఎం సెంటర్‌లో విగ్రహాల విక్రయదారులు అంటున్నారు. మట్టి గణపతి విగ్రహాలను కూడా ఈసారి ఆర్డర్‌పై తీసుకున్నవారు కూడా పదుల సంఖ్యలో ఉన్నారని తెలి పారు. పర్యావరణాన్ని పరిరక్షించాలనే నినాదంతో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ), తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలితో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు మట్టి వినాయకుడి ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. మట్టెవాడలోని ఎల్లంబజార్‌లో 45 అడుగుల మహా ‘విజయగణపతి’ విగ్రహం ఆకట్టుకుంటోంది.