
స్థానిక ఎన్నికల్లో సత్తాచాటాలి
● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
సంగెం: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి సత్తా చాటాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని కుంటపల్లి గ్రామంలో బీఆర్‌ఎస్ నుంచి కడమంచి రమేశ్, రవి, పర్వతం భీములు, యాకయ్య, రాజు బీజేపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు అనుముల రాజు, నర్సయ్యలతో పాటుగా 60 మంది పీసీసీ ఉపాధ్యక్షుడు దొమ్మాటి సాంబయ్యతో కలిసి ప్రకాశ్‌రెడ్డి కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి అహ్వానించారు. ఈ సందర్భంగా రేవూరి మాట్లాడుతూ.. కొత్తపాత అనే తేడా లేకుండా సమన్వయంతో స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు చొల్లేటి మాధవరెడ్డి, నియోజకవర్గ అధికార ప్రతినిధి జనగాం రమేశ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రమేశ్, నాయకులు నాగరాజు, జగన్నాథచారి, అంజన్‌రావు, ప్రతాప్‌రెడ్డి, స్వామి, రాజు, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.