
త్వరితగతిన పరిష్కారం
● ప్రజల ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచొద్దు
● ప్రజావాణిలో వినతులను స్వీకరించిన
కలెక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా ప్రజలనుంచి వినతులను స్వీకరించారు. పరిష్కార నిమిత్తం ఆయా శాఖల అధికారులకు అందజేశారు. ప్రజావాణిలో అధికంగా రెవెన్యూ సమస్యలు 58, జీడబ్ల్యూఎంసీ 30, గృహనిర్మాణ శాఖ 12, సహకారశాఖ 7, పౌరసరఫరాల శాఖ 5, ఇతర శాఖలకు సంబంధించిన 39 ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ మాట్లాడుతూ.. ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు మానవీయ కోణంలో పరిశీలన చేసి పరిష్కరించాలన్నారు. చేపట్టిన చర్యలను ఫిర్యాదుదారులకు వివరిస్తూ సమాచారం అందజేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి,, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, జిల్లా అధికారులు పుష్పలత, సత్యపాల్‌రెడ్డి, ఉమారాణి పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇల్లు బిల్లు చెల్లించాలి
నాకు ఇందిరమ్మ ఇంటి పథకం ద్వారా ఇల్లు మంజూరు అయ్యింది. ప్లాన్ ప్రకారం పిల్లర్లు, బెడ్ పోసుకున్నాను. అప్పుచేసి ఆ పనులు పూర్తి చేశా. రెండునెలలు అయ్యింది. బిల్లులు రాలేదు. సమస్యను పరిష్కరించాలని విన్నపం.
– అందె జాన్సీ,
రంగశాయిపేట, వరంగల్
డీలర్లకు కమీషన్ చెల్లించాలి..
డీలర్లకు ఏప్రిల్ నుంచి రావాల్సిన 5నెలల కమీషన్ డబ్బులు చెల్లించాలి. ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం డీలర్లకు కనీస గౌరవ వేతనం ఇవ్వాలి.
– వరంగల్ జిల్లా రేషన్ డీలర్ల సంఘం
అక్రమ టెండర్ ఆపాలి..
వరంగల్ లక్ష్మిపురం కూరగాయల మార్కెట్‌లో కూరగాయల వర్తక సంఘం వినాయక చవితి పేరుతో అక్రమంగా టెండర్ నిర్వహించి కొందరు వ్యక్తులు డబ్బులు దండుకోవాలని చూస్తున్నారు. ఆ టెండర్ ప్రక్రియను ఆపాలి. గతంలో టెండర్ పెట్టొద్దని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. మళ్లీ నిర్వహిస్తున్నారు.
–జిల్లా హోల్‌సేల్,
రిటైల్ కూరగాయల మార్కెట్ కమిటీ
రీ–ఎంక్వయిరీ పేరుతో కాలయాపన..
నాకు దక్కాల్సి ఉన్న 24 గుంటల భూమికి సంబంధించి ఎఫ్‌లైన్ పిటిషన్ ద్వారా సర్వేయర్ రిపోర్ట్ ఇచ్చినా మండల అధికారులు రాజకీయ నాయకుల ప్రమేయంతో రీ–ఎంక్వయిరీ పేరుతో కాలయాపన చేస్తున్నారు. అధికారులు న్యాయం చేయాలి. – రాపర్తి సమ్మయ్య, మంచుప్పుల, నల్లబెల్లి
●

త్వరితగతిన పరిష్కారం

త్వరితగతిన పరిష్కారం

త్వరితగతిన పరిష్కారం

త్వరితగతిన పరిష్కారం