
మట్టిగణపతి విగ్రహాలను పూజించాలి
న్యూశాయంపేట: గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో మట్టితో చేసిన గణపతి విగ్రహాలను పూజించాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ హాల్‌లో మట్టి గణపతులను పూజించాలనే పోస్టర్లను ఆవిష్కరించి అధికారులకు మట్టివిగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి,, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
స్కాలర్‌షిప్‌ల కోసం
దరఖాస్తు చేసుకోండి
న్యూశాయంపేట: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలల ఇంటర్మీడియట్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ, బీటెక్, బీఫార్మసీ, ఎంటెక్, ఎంపార్మసీ, ఫార్మ్‌డీ మొదలగు పోస్ట్ మెట్రిక్ కోర్సులు చదువుచున్న అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులు 2025–26 విద్యాసంవత్సరానికి ఫ్రెష్, రెన్యూవల్ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఎ.పుష్పలత సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. ఈమేరకు ప్రిన్సిపాళ్లు విద్యార్థులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో https://telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. సెప్టెంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
కృష్ణుడి ప్రతిమ ఊరేగింపు
నర్సంపేట : త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కృష్ణుడి ప్రతిమను సోమవారం ఊరేగించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నర్సంపేట పట్టణంలోని విష్ణుశర్మ వీధిలో ఏర్పాటు చేసిన స్వామి వారికి నిత్య పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ఓంప్రకాశ్ ఆచారి, కాసుల లక్ష్మణ్, శంకరా, సిద్దయ్య, సురేశ్, దేవేందర్, సుధాకర్, కిరణ్, శరత్, హనుమయ్య, కట్టయ్య, పద్మ, విక్రమాచారి, భక్తులు పాల్గొన్నారు.
ప్రత్యేక అలంకరణలో
సిద్ధేశ్వరుడు
నర్సంపేట : చెన్నారావుపేట మండలంలోని శ్రీ సిద్ధేశ్వరాలయంలో భాద్రపద మాసం సోమవారం సందర్భంగా సిద్ధేశ్వరుడిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. జల్లి గ్రామానికి చెందిన కాట శ్రీనివాస్‌పద్మ దంపతులు పంచామృతాలు, పూలదండలను కానుకగా సమర్పించారు.
అయ్యప్ప స్వామికి
ప్రత్యేక అభిషేకం
నర్సంపేట : నర్సంపేట పట్టణంలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామి దేవాలయంలో ఆలయ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శింగిరికొండ మాధవశంకర్‌గుప్తా ఆధ్వర్యంలో ఎనిమిదో మాస దివ్య పడిపూజ మహోత్సవం సోమవారం నిర్వహించారు. పూజలో బండారు విజయలక్ష్మి –దామోదర్, జనగాం సుజాత–మహేందర్‌రావు, కూచన వనజ–వేణుగోపాల్ పాల్గొని అయ్యప్పస్వామి, మహాలక్ష్మి అమ్మవారు విగ్రహాలకు అభిషేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాధవశంకర్ గుప్తా మాట్లాడుతూ ఆలయం నూతన నిర్మాణ అభివృద్ధిలో భక్తులకు సకల సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు.

మట్టిగణపతి విగ్రహాలను పూజించాలి

మట్టిగణపతి విగ్రహాలను పూజించాలి