
భద్రతపై శ్రద్ధచూపాలి
● విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
● క్షేత్రస్థాయి పరిశీలనలో ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి
నర్సంపేట: విద్యుత్ సిబ్బంది భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపి ఎర్త్ డిశ్చార్డ్ రాడ్, సేఫ్టీ పరికరాలతో, లైన్‌లో విద్యుత్ సరఫరా లేదని నిర్ధారించుకున్న తర్వాతనే పనిచేయాలని టీజీ ఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్పాటి వరుణ్‌రెడ్డి సూచించారు. ఈమేరకు నర్సంపేట మండలం లక్నెపల్లి 33/11కేవీ, నర్సంపేట టౌన్, ఖానాపురం సబ్‌స్టేషన్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇందులో భాగంగా హెచ్‌టీ సర్వీస్‌లకు ఏఎంఆర్‌లు అమర్చడంలో వివిధ సాంకేతిక విశ్లేషణను పరిశీలించారు. 33/11కేవీ సబ్‌స్టేషన్ ఆటోమేషన్ పురోగతి పర్యవేక్షించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, ట్రాన్స్‌ఫార్మర్ ఫెల్యూర్స్, ప్రత్యామ్నాయ లైన్‌లు, అదనపు ట్రాన్స్ ఫార్మర్ల బిగింపు వివరాలను సమీక్షించారు. ప్రతి ఉద్యోగి భద్రతపై అవగాహనతో పనిచేస్తూ గ్రామాల్లో, పొలాల్లో ఉన్న లూజ్‌లైన్‌లను సరిదిద్దాలని, ప్రమాకరమైన లైన్‌లను సరిచేసి ఎవరికీ ప్రాణహాని కలుగకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ గౌతంరెడ్డి, సంపత్‌రెడ్డి, జాటోత్ హర్జనాయక్, తిరుపతి డివిజన్ ఇంజనీర్లు, అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్లు పవన్‌కుమార్, రాజేశ్‌రెడ్డి, ఏఈలు పాల్గొన్నారు.
ఖానాపురంలో..
ఖానాపురం: మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్‌లో అభివృద్ధి పనులను సీఎండీ వరుణ్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా అంతరాయాలు, ట్రాన్స్‌ఫార్మర్ ఫెయిల్యూర్స్, ప్రత్యామ్నాయ లైన్‌లు, అదనపు ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాట్లను తనిఖీ చేశారు. సూపరింటెండెంట్ ఇంజనీర్ గౌతంరెడ్డి, డీఈలు సంపత్‌రెడ్డి, హర్జినాయక్, తిరుపతి, పవన్‌కుమార్, రాజేశ్‌రెడ్డి, ఏఈ మంగమ్మ పాల్గొన్నారు.