
ఎఫ్‌ఏసీ డీఈఓగా రంగయ్యనాయుడు బాధ్యతలు
● సన్మానించిన ఉద్యోగులు
విద్యారణ్యపురి: వరంగల్ పుల్ అడిషనల్ చార్జి(ఎఫ్ ఏసీ) డీఈఓగా పాఠశాల విద్యాశాఖ ఆర్‌జేడీ కార్యాలయం అసిస్టెంట్ డైరెక్టర్ బి.రంగయ్యనాయుడు ఆదివారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. ఈనెల 23న కలెక్టర్ సత్యశారద వరంగల్ ఎఫ్‌ఏసీ డీఈఓగా రంగయ్యనాయుడిని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన డీఈఓగా విధుల్లో చేరేందుకు తొలుత విముఖత వ్యక్తం చేశారు. విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో డీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కోఆర్డి నేటర్ సుజన్‌తేజ, సూపరింటెండెంట్‌లు బాబ్జి, జ్యోతి, ఏఎస్‌వో వేణుగోపాల్, టీ ఎన్‌జీవోజిల్లా ఉపాధ్యక్షుడు రామానుజం, జగదీశ్వర్ ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు. రంగయ్యనాయుడికి హనుమకొండ జిల్లా , వరంగల్ జిల్లా ఎఫ్‌ఏసీ డీఈఓగా గ తంలో బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఉంది.