
పాదయాత్రను విజయవంతం చేయాలి
● వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
వర్ధన్నపేట: ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ ఈ నెల 25న ఇల్లంద మార్కెట్ నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు చేపట్టిన జనహిత పాదయాత్రను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చా రు. పాదయాత్ర ఇన్‌చార్జ్‌లు ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, పులి అనిల్, జూలూరి ధనలక్ష్మి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, నమిండ్ల శ్రీనివాస్, బొంతు రామ్మోహన్, పీసీసీ ప్రధాన కార్యదర్శులు దుద్దిళ్ల శ్రీనుబాబు, పల్లె శ్రీనివాస్, మోత్కూరి ధర్మారావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణతో కలిసి ఎమ్మెల్యే నాగరాజు శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేస్తోందని తెలిపారు. చీకటి ఒప్పందం కుదుర్చుకుని బీజేపీ, బీఆర్‌ఎస్ చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మి మోసపోవద్దని సూచించారు. గతంలో లక్ష ఓట్ల మెజారి టీ వచ్చిన వారిని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. నాయకులు కేఆర్ దిలీప్‌రాజ్, పిన్నింటి అనిల్‌రావు, తూళ్ల రవి, ఎద్దు సత్యనారాయణ, అబ్బిడి రాజిరెడ్డి పాల్గొన్నారు.