
బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత
ధర్మసాగర్: బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్. కె పట్టాభి రామారావు అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్. కె.పట్టాభిరామారావు, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి క్షమాదేశ్ పాండే, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి రామలింగం, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రావణ స్వాతితో కలిసి మాట్లాడారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. 18 ఏళ్లలోపు బాలికలకు వివాహం చేస్తే చట్టరీత్య నేరమని, అందుకు సహకరించిన వారు శిక్షార్హులవుతారని తెలిపారు. బాల్య వివాహాల నిర్మూలన కోసం అర్చక సమాఖ్యతో పాటు పురోహితులు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. జాగృతి పోలీస్ కళా బృందం వారు నాటక ప్రదర్శన చేసి అందరినీ ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో సీఐ, ప్రవీణ్‌కుమార్, డిప్యూటీ తహసీల్దార్ సంతోశ్, జిల్లా బాలల పరిరక్షణ ఇన్‌చార్జ్ అధికారి ఎస్.ప్రవీణ్ కుమార్, సఖి వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ హైమావతి, జిల్లా మిషన్ శక్తి కో–ఆర్డినేటర్ కళ్యాణి, ఎస్‌ఐ జానీ పాషా, జాగృతి పోలీస్ కళా బృందం, మండల ప్రాజెక్ట్ మేనేజర్, ఏఓ రాజేశ్, సర్వోదయ యూత్ ఆర్గనైజషన్, జెండర్ ఎక్స్‌పర్ట్ ఇందిర, అంగన్వాడీ టీచర్లు, గ్రామైక్య సంఘం వీఓలు తదితరులు పాల్గొన్నారు.