‘డబుల్‌’ డిమాండ్‌! | - | Sakshi
Sakshi News home page

‘డబుల్‌’ డిమాండ్‌!

Aug 22 2025 3:03 AM | Updated on Aug 22 2025 3:03 AM

‘డబుల

‘డబుల్‌’ డిమాండ్‌!

మరో రూ.115 కోట్లు అవసరమే..

సాక్షి, వరంగల్‌: మామునూరు విమానాశ్రయ నిర్మాణ పనులు ఈ ఏడాది ఆఖరులోగా మొదలు పెట్టాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉంది. అందుకు అవసరమయ్యే భూమిని సేకరించి ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా వద్ద 696 ఎకరాల భూమి ఉంది. రన్‌వే విస్తరణకు అవసరమయ్యే 253 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం ఇటీవల రూ.205 కోట్లు కేటాయించింది. పరిపాలనాపరమైన అనుమతులివ్వడంతో కన్సెంట్‌ ఇచ్చిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతున్నాయి. ఇప్పటి వరకు 48 మంది రైతుల ఖాతాల్లో రూ.34,86,05,298 జమ చేశారు. వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.కోటి 20 లక్షలు చెల్లిస్తుండడంతో చాలా మంది రైతులు ఇప్పటికే కన్సెంట్‌ ఇచ్చారు.

రెట్టింపు కావాలని డిమాండ్‌

వ్యవసాయేతర భూముల (ఓపెన్‌ ప్లాట్లు)కు చదరపు గజానికి రూ.4,887లు ఇస్తామని వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద నేతృత్వంలోని డిస్ట్రిక్ట్‌ లెవెల్‌ ల్యాండ్‌ నెగోషియేషన్‌ కమిటీ పలుదఫాలుగా సమావేశమై నిర్ణయించింది. అందుకు రెట్టింపు కావాలంటూ చాలా మంది భూనిర్వాసితులు డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో వ్యవసాయేతర భూముల యజమానులతో మరోసారి సమావేశం నిర్వహించనున్నారు. చివరిగా మరో చదరపు గజానికి రూ.500 నుంచి రూ.600ల వరకు పెంచే వీలుందనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఎవరైనా భూ యజమానులు పరిహారం తీసుకోకపోతే ఆ డబ్బును కోర్టులో డిపాజిట్‌ చేసి చట్ట ప్రకారం భూమి సేకరించాలని అధికారులు ఆలోచిస్తున్నట్లు తెలిసింది.

రూ.12 వేలకు గజం ఇస్తా..

నేను వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నా. నెక్కొండ ప్రధాన రహదారిపై గుంటూరుపల్లిలో 968 గజాల ఇంటి స్థలం ఉంది. ఈస్థలం మామునూరు ఎయిర్‌పోర్ట్‌ రన్‌వే కింద పోతోంది. బహిరంగ మార్కెట్‌ ప్రకారం భూ పరిహారం చెల్లించాలి. నాకు 968 గజాల స్థలం ఉండగా.. ప్రభుత్వం రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు గజం ఇచ్చేందుకు ముందుకు వస్తోంది. మార్కెట్‌ ధర కాకుండా గజం రూ.12 వేలు పరిహారం ఇస్తే భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా.

– ఎం.రాంబాబు, గుంటూరుపల్లి

విమానాశ్రయ నిర్మాణానికి నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లి గ్రామాల్లో 240 ఎకరాల వ్యవసాయ భూమి, సుమారు 13 ఎకరాల (61,134.5 చదరపు గజాల) వ్యవసాయేతర భూమి సేకరించాల్సి ఉంది. సాగుకు సంబంధించిన 240 ఎకరాలకు భూపరిహారం కింద రూ.288 కోట్లు అవుతున్నాయి. 61,134.5 చదరపు గజాలకు రూ.29,87,61,858 భూనిర్వాసితులకు చెల్లించాలి. మొత్తంగా రూ.317 కోట్లు అవసరం అవుతుండడంతో మరోదఫా ప్రభుత్వం రూ.112 కోట్లు నిధులు కేటాయించాల్సిన అవసరం కనబడుతోంది. వ్యవసాయేతర భూముల రైతులకు చదరపు గజానికి మరో రూ.600లు పెంచినా రూ.ముడు నుంచి రూ.నాలుగు కోట్లు అదనంగా అవసరమవుతాయి. ఈ లెక్కన రూ.320 కోట్లకుపైగా అవసరం కానుంది.

వ్యవసాయ భూముల రైతుల ఖాతాల్లో జమవుతున్న నగదు

రేటు పెంచాలంటున్న

వ్యవసాయేతర భూ యజమానులు

తుది సమావేశం నిర్వహించే

యోచనలో అధికారులు

‘డబుల్‌’ డిమాండ్‌!1
1/1

‘డబుల్‌’ డిమాండ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement