
శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలి
ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్‌కుమార్
దామెర: గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు కృషి చేయాలని ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్‌కుమార్ అన్నారు. మండల కేంద్రలోని పోలీస్‌స్టేషన్‌ను ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు పరిశీలించారు. ప్రాపర్టీ రూమ్, సన్నిహిత పిటిషన్లు, క్రైమ్ ఫైల్స్, పోలీస్ స్టేషన్‌లో నమోదు అవుతున్న కేసుల వివరాలను ఎస్సై కొంక అశోక్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ.. పోలీసులు ప్రజల విశ్వాసాన్ని చూరగొనేలా విధులు నిర్వహించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తు వేగవంతం చేసి నేరస్తులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో పర్యటించి మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించి యువతలో చైతన్యం తీసుకురావాలని వెల్లడించారు. వీపీఓలు ఆయా గ్రామ ప్రజలతో సన్నిహితంగా ఉండాలని, పోలీస్ స్టేషన్‌కు వచ్చే దరఖాస్తుదారులతో సోదరభావంతో మెలగాలని పేర్కొన్నారు. ఆయన వెంట ఎస్సై కొంక అశోక్, ఏఎస్సైలు యాకయ్య, రమేశ్, సిబ్బంది తదితరులు ఉన్నారు.
సమాచారం నమోదు చేయాలి
● బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్
రామన్నపేట: చెత్త తరలింపు వాహనాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ శానిటేషన్ అధికారులను ఆదేశించారు. బుధవారం బల్దియా పరిధి రాంపూర్‌లోని డంపింగ్ యార్డ్‌ను ఆమె క్షేత్రస్థాయిలో పర్యటించి వ్యర్థాలు నిర్వహణపై అధికారులకు సూచనలిచ్చారు.