
ఇందిరమ్మ ఇళ్లు, పీహెచ్‌సీ పరిశీలన
ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండల కేంద్రంలో బుధవారం అడిషనల్ కలెక్టర్ వెంకట్‌రెడ్డి పర్యటించారు. స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పలు రికార్డులు పరిశీలించారు. వర్షాకాలం సందర్భంగా సీజనల్ వ్యాధుల బారిన పడే వారికి సిబ్బంది అందుబాటులో ఉండి వైద్యసేవలందించాలన్నారు. అనంతరం నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. పనులు సకాలంలో పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. అక్కడి నుంచి కేజీబీవీ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందించే ఆహారాన్ని పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూ భారతి దరఖాస్తుల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యల గురించి తహసీల్దార్ ప్రసాద్‌రావును అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీడీఓ విజయ్‌కుమార్, కార్యదర్శి శ్రీనివాస్, వైద్య సిబ్బంది, పాఠశాల ప్రిన్సిపాల్ అనితాదేవి, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.