
కొత్త కార్డు రావడం ఆనందంగా ఉంది..
సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారు. రేషన్‌కార్డు కోసం 11 సంవత్సరాలుగా ఎదురుచూశాం. కొత్త రేషన్‌కార్డులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో దరఖాస్తు చేసుకున్నాం. అధికారులు సర్వే చేసి మాకు కార్డు మంజూరు చేశారు. నాపేరు, భర్త, ఇద్దరు పిల్లల పేర్లతో కూడిన కార్డు మాకు వచ్చింది. సెప్టెంబర్ నెల నుంచి నలుగురికి 24 కిలోల బియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయం. నాకుటుంబానికి కొత్త కార్డు రాడడం ఎంతో ఆనందంగా ఉంది.
– భార్గవి, తిలక్‌రోడ్డు కాశిబుగ్గ, వరంగల్