వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రెం డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన గుణశేఖర్ మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకొని పూలమొక్క అందజేశారు. కమిషనరేట్ పరిధిలో చోరీలను నియంత్రించడంతో పాటు పెండింగ్ కేసుల్లో పట్టుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై సీపీ సన్‌ప్రీత్‌సింగ్ సూచించారు.
నానో యూరియాతో లాభాలు : డీఏఓ
రాయపర్తి: నానో యూరియాతో రైతులకు లాభాలు ఉన్నాయని జిల్లా వ్యవసాయాధికారి కె.అనురాధ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని రైతు దాసరి మహేందర్ వ్యవసాయక్షేత్రంలో మంగళారం నానో యూరియా క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. నానో యూరియా కు ధర తక్కువ అని, డ్రోన్‌తో సులభంగా పిచికారీ చేయవచ్చని చెప్పారు. యూరియా, నానో యూరియాకు తేడాపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కిషన్‌నాయక్, మండల వ్యవసాయాధికారి గుమ్మడి వీరభద్రం, సొసైటీ చైర్మన్ రామచంద్రారెడ్డి, సీఈఓ సోమిరెడ్డి, రైతులు పాల్గొన్నారు.
లక్ష్యాన్ని సాధించాలి
న్యూశాయంపేట: వనమహోత్సవంలో భాగంగా అధికారులు నిర్దేశిత లక్ష్యాన్ని వారంలోగా సాధించాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్‌హాల్‌లో ఇన్‌చార్జ్ డీఎఫ్‌ఓ కృష్ణమూర్తితో కలిసి మంగళవారం వనమహోత్సవంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా లక్ష్యం 31,04,272 కాగా.. ఇప్పటి వరకు 21,85,252 మొక్కలు నాటినట్లు తెలిపారు. 10,29, 230 మొక్కలకు జియోట్యాగింగ్, మేరీ లైఫ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తూ వాటిని సంరక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
ఖానాపురం: రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు మండలంలోని బుధరావుపేట ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి సాయిచరణ్ ఎంపికై నట్లు పీఈటీ దేవేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఈనెల 18 నుంచి రంగారెడ్డిలో రాష్ట్రస్థాయి క్రీడా ఎంపిక పోటీలు నిర్వహిస్తోంది. ఇందులో సాయిచరణ్ ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. ఈ మేరకు పాఠశాలలో ఆయనను ఉపాధ్యాయులు, పీఈటీ అభినందించారు.
ఇనుప స్తంభానికి విద్యుత్
దుగ్గొండి: తిమ్మంపేటలోని నారాయణతండా రోడ్డులో నరహరి సాంబరెడ్డి వ్యవసాయ బావి వద్ద ఉన్న ఇనుప స్తంభానికి ఎర్త్ పాసై విద్యుత్ సరఫరా అవుతోందని రైతులు పేర్కొంటున్నారు. వంగిపోయి 11కేవీ, ఎల్‌టీ లైన్లు ఉన్న ఈ స్తంభంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సిమెంట్ స్తంభం ఏర్పాటు చేసి, తీగలు సరిచేయాలని రైతులు కోరుతున్నారు.
ఉపాధి హామీ డబ్బులు రికవరీ చేయాలి
నర్సంపేట: ఉపాధి హామీ పథకం పనుల్లో జరిగిన అవకతవకలపై డబ్బులను రికవరీ చేయాలని డీఆర్డీఓ కౌసల్యాదేవి ఆదేశించారు. చెన్నారావుపేట మండల కేంద్రంలో మంగళవారం సోషల్ ఆడిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక తనిఖీ బృందం ఎస్‌ఆర్పీ, డీఆర్పీలు ఉపాధి హామీ పనులపై నిర్వహించిన సోషల్ ఆడిట్ నివేదికలను డీఆర్‌డీఓకు సమర్పించారు. నివేదికల ఆధారంగా ప్రోగ్రాం ఆఫీసర్, ఏపీఓ, ఈసీ, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శుల నుంచి రూ.46,527 రికవరీ చేయాలని డీఆర్డీఓ ఆదేశించారు. రికవరీ కింద డబ్బులు చెల్లించకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.