
నకిలీ వైద్యకేంద్రాల్లో తనిఖీలు
ఎంజీఎం: నగరంలోని కాశిబుగ్గ ప్రాంతంలో అర్హత లేకుండా నిర్వహిస్తున్న నకిలీ వైద్యకేంద్రాలపై మంగళవారం రాత్రి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యు ల బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. తిలక్‌నగర్ ప్రాంతానికి చెందిన మామిడి ఈశ్వరయ్య అనే వ్యక్తి ఎల్ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తూ డాక్టర్ అని పోస్టర్ పెట్టుకుని ఆర్ఎంపీ అసోసియేషన్ అధ్యక్షుడిగా చలామణి అవుతూ రోగులను మోసం చేస్తున్నట్లు సభ్యులు వెల్లడించారు. చట్టవిరుద్ధంగా అనుమతి లేకుండా త్రివేణి క్లినిక్ నడుపుతున్నాడని తెలిపారు. ఎస్ నయిమ్ అనే వ్యక్తి ఎక్స్‌రే టెక్నిషియ న్ చదివి హిజమా స్పీకింగ్ థెరపీ పేరుతో అనుమతి లేని డిగ్రీలు పెట్టుకుని పడకలు ఏర్పాటు చేసి సైలెన్ పెట్టడం, అధిక మోతాదు స్టిరాయిడ్స్, యాంటీబయోటిక్స్ రోగులకు ఇస్తున్నట్లు గుర్తించారు.