
అన్ని స్థానాలు కై వసం చేసుకోవాలి
పరకాల: పాత, కొత్త తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా సమన్వయంతో కాంగ్రెస్ అభివృద్ధికి కృషి చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకునేందుకు పాటుపడాలని కోరారు. సోమవారం పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రేవూరి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ గ్రామంలో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. గత ప్రభుత్వాల వైఫల్యాలు, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించాలని కోరారు. త్వరలో పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో పరకాల, ఆత్మకూరు, దామెర, నడికూడ మండలాల సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి