
యూరియా కొరత.. రోడ్డెక్కిన రైతులు
ఎల్కతుర్తి: కాంగ్రెస్ ప్రభుత్వం యూరియాను సకాలంలో అందించడం లేదని మండల రైతులు ఎల్కతుర్తి మండల కేంద్రంలోని హనుమకొండ–కరీంనగర్ ప్రధాన రహదారిపై సోమవారం రాస్తారోకోకు దిగారు. రైతులకు సరిపడా యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులకు రెండు యూరియా బస్తాలు మాత్రమే ఇస్తే, అవి ఏ మూలకూ సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులకు పూర్తిస్థాయిలో యూరియా అందించాలని డిమాండ్ చేశారు. పోలీసులు కలగుజేసుకుని యూరియా అందించేలా అధికారులతో మాట్లాడించడంతో ఆందోళన విరమించారు. కా ర్యక్రమంలో పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.