పాల అమ్మకాలు ఎందుకు తగ్గుతున్నాయి? | - | Sakshi
Sakshi News home page

పాల అమ్మకాలు ఎందుకు తగ్గుతున్నాయి?

Aug 19 2025 6:48 AM | Updated on Aug 19 2025 6:48 AM

పాల అమ్మకాలు ఎందుకు తగ్గుతున్నాయి?

పాల అమ్మకాలు ఎందుకు తగ్గుతున్నాయి?

ఖమ్మంలో వరంగల్‌ పాలు

హన్మకొండ చౌరస్తా: నగరంలోని ములుగురోడ్‌ సమీపంలో గల ప్రభుత్వ రంగ సంస్థ విజయ డె యిరీ యూనిట్‌ను సోమవారం హైదరాబాద్‌ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారుల బృందం తనిఖీ చేసింది. ఈ డెయిరీ అధికారుల తీరుపై ఇటీవల వస్తున్న విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో విచారణ కోసం ఎండీ ప్రత్యేక కమిటీని నియమించినట్లు తెలిసింది. ఆయన ఆదేశాలతో నగరానికి చేరుకున్న ప్రత్యేక కమిటీ ఏడాదికాలంగా జరిగిన పాల అమ్మకాలు, సేకరణ, రికార్డులను పరిశీలించారు. ఉదయం 11 గంటలకు డెయిరీకి చేరుకున్న అధికారులు సాయంత్రం 4గంటల వరకు విచారణ చేపట్టారు.

తగ్గిన అమ్మకాలు

విజయ డెయిరీ వరంగల్‌ పరిధిలో సివిల్‌ మార్కెట్‌లో పాల అమ్మకాలు గతేడాది సుమారు ఆరు వేల లీటర్లు ఉండగా, ఈ ఏడాది సగానికి పైగా పడిపోయినట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైనట్లు తె లిసింది. అంతేకాకుండా పాడిరైతులకు, డెయిరీ అ ధికారులకు దూరం పెరగడంతో సేకరణ సైతం గ ణనీయంగా పడిపోయింది. దీనిపై విచారణ అధికా రులు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

పెండింగ్‌లో లక్షల రూపాయలు

పాల అమ్మకాల డబ్బులు లక్షల్లో పెండింగ్‌లో ఉండడంపై అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పాల అమ్మకాల కోసం గత ఏడాది ఓ డిస్ట్రిబ్యూటర్‌ను నియమిస్తే సదరు వ్యక్తి మధ్యలోనే చేతులెత్తేశాడు. డిస్ట్రిబ్యూటర్‌ ద్వారా డెయిరీకి చెల్లించాల్సిన సుమారు రూ.30 లక్షల వరకు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా నెల రోజుల క్రితం కొత్తగా మరో డిస్ట్రిబ్యూటర్‌కు అమ్మకాల బాధ్యత అప్పగించినట్లు తెలుస్తోంది.

సిబ్బందితో సమావేశం

హైదరాబాద్‌ నుంచి వచ్చిన ప్రత్యేక కమిటీ సభ్యులు.. వరంగల్‌ డెయిరీ సిబ్బందితో రెండు గంటలపాటు సమావేశమయ్యారు. పాల అమ్మకాలను పెంచుకోవడంతోపాటు పాడిరైతులకు మరింత చేరువై సేకరణను ఎలా పెంచుకోవాలి అనే అంశాలపై సిబ్బంది నుంచి పలు సలహాలు, సూచనలు స్వీకరించారు. సమష్టిగా పనిచేసి డెయిరీ ప్రతిష్టను పెంచుకుందామని సిబ్బందికి సూచించారు. విచారణ కమిటీలో విజయ డెయిరీ వరంగల్‌ ప్రత్యేక అధికారి, జనరల్‌ మేనేజర్లు మల్లయ్య, కవిత, ప్రొక్యూర్‌మెంట్‌ అధికారి మధుసూదన్‌రావు, ఆర్‌ఎస్‌ఎం ధన్‌రాజ్‌ ఉన్నారు.

వరంగల్‌ పాలు.. ఖమ్మంలో ఎలా అమ్మారు?

విజయ డెయిరీలో

ప్రత్యేక కమిటీ విచారణ

పాల డబ్బులు పెండింగ్‌లో

ఉండడంపై ఆరా

వరంగల్‌ యూనిట్‌ పాల ప్యాకెట్లు గత నెలలో ఖమ్మంలో అమ్ముతుండగా అక్కడి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని ఆధారాలతో సహా ఉ న్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈవిషయ ంపైనా వరంగల్‌ అధికారులను ఉన్నతాధికారులు ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పకుండా దాటవేసినట్లు డెయిరీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement