
తెలంగాణ సైన్స్ కాంగ్రెస్‌తో శాసీ్త్రయ దృక్పథం
స్వర్ణోత్సవంలోకి కేయూ..
– 8లోu
కేయూ క్యాంపస్: విద్యార్థులు, యువతలో శాసీ్త్రయ దృక్పథం పెంపొందించడమే లక్ష్యంగా టాస్, కాకతీయ యూనివర్సిటీ సంయుక్తంగా యూనివర్సిటీలో తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (టాస్), హైదరాబాద్ సీసీఎంబీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ సీహెచ్. మోహన్‌రావు తెలిపారు. మంగళవారం నుంచి మూడు రోజులపాటు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సోమవారం కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాల సెమినార్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశాభివృద్ధి అనేది సైన్స్ అండ్ టెక్నాలజీపైనే ఆధారపడి ఉంటుందన్నారు. ఏ రంగంలో రాణించాలన్నా సైన్స్ ముఖ్యమన్నారు. ఆ దిశగా విద్యార్థుల్లో సైన్స్‌ను ప్రమోట్ చేసేందుకు, జిజ్ఞాస పెంచేందుకు తెలంగాణ సైన్స్ కాంగ్రెస్‌లో సైంటిస్టులు, విద్యావేత్తలు నూతన ఆవిష్కరణలపై శాసీ్త్రయ సవాళ్లు, పురోగతులపై చర్చించనున్నారన్నారు. కేయూ స్వర్ణోత్సవంలోకి అడుగిడుతున్న నేపథ్యంలో యూనివర్సిటీలో అకాడమిక్‌పరంగా పర్‌స్పెక్టివ్ మారాలన్నారు. ఇన్నోవేషన్స్, ఇంక్యుబేషన్, స్టార్టప్స్ ఎంట్రప్రెన్యూర్స్ రావాలన్నారు. కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. కాకతీయ యూనివర్సిటీ స్వర్ణోత్సవాల్లో భాగంగానే తెలంగాణ సైన్స్‌కాంగ్రెస్‌ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.వెంకట్రామ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి 750 అబ్‌స్ట్రాక్ట్స్ వచ్చాయని, 700 మంది ప్రతినిధులు రానున్నట్లు తెలిపారు. కేయూ ఆడిటోరియంలో మంగళవారం ఉదయం 9గంటలకు సైన్స్‌కాంగ్రెస్ ప్రారంభ సమావేశంలో వీసీ ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన డీఆర్డీఓ మాజీ చైర్మన్, భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ సలహాదారు డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారని చెప్పారు. సమావేశంలో టాస్ జనరల్ సెక్రటరీ, ఓయూ మాజీ వీసీ ఎస్.సత్యనారాయణ, కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం, టాస్ ట్రెజరర్ ప్రొఫెసర్ ఎస్‌ఎం రెడ్డి పాల్గొన్నారు.
నేటినుంచి మూడు రోజులపాటు
నిర్వహణ
టాస్ అధ్యక్షుడు, సీసీఎంబీ
మాజీ డైరెక్టర్ మోహన్‌రావు
యూనివర్సిటీ ఆవిర్భవించి
49 ఏళ్లు పూర్తి
నేడు 50వ వసంతంలోకి..