మంగళవారం శ్రీ 19 శ్రీ ఆగస్టు శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

మంగళవారం శ్రీ 19 శ్రీ ఆగస్టు శ్రీ 2025

Aug 19 2025 6:48 AM | Updated on Aug 19 2025 6:48 AM

మంగళవ

మంగళవారం శ్రీ 19 శ్రీ ఆగస్టు శ్రీ 2025

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

న్యూస్‌రీల్‌

హనుమకొండ జిల్లాలో..

వరంగల్‌ జిల్లాలో..

క్షేత్రస్థాయిలో అవగాహన..

హన్మకొండ: వర్షాకాలంలో విద్యుత్‌ రూపంలో ప్రమాదం పొంచి ఉంది. ఏమాత్రం ఆదమరిచినా.. ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి. తడిదుస్తులు ఆరేస్తూ, మోటార్లు ఆన్‌ చేస్తూ, మరమ్మతుల సమయంలో విద్యుత్‌ తీగలు పట్టుకుని, తెగిన తీగల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. తెగిన విద్యుత్‌ లైన్లు, టాన్స్‌ఫార్మర్‌ గద్దెలు ఎత్తు తక్కువగా ఉండడంతో పశువులు విద్యుదాఘాతానికి గురై చనిపోతున్నాయి. ఈక్రమంలో విద్యుత్‌ వినియోగదారులు, రైతులు వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. విద్యుత్‌ సిబ్బంది భద్రతా చర్యలు పాటించకపోవడంతో పాటు ఎల్‌సీల్లో నిబంధనలు పాటించకపోవడం, నిర్లక్ష్యం కారణంగా విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

● తడిసిన విద్యుత్‌ స్తంభాల స్టే వైర్‌, సపోర్ట్‌ వైరును, ట్రాన్స్‌ఫార్మర్‌, తడిచిన విద్యుత్‌ ఉపకరణాలను తాకవద్దు.

● దండెం వైర్లను, విద్యుత్‌ వైర్లను కలుపవద్దు. సపోర్ట్‌ వైర్లుగా ఇన్సులేటెడ్‌ జీఐ వైర్లను ఉపయోగించాలి.

● వోల్టేజ్‌లో హెచ్చుతగ్గులు ఉన్నా, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద శబ్దం వస్తున్నా విద్యుత్‌ శాఖ వారికి తెలియజేయాలి.

● వర్షాల కారణంగా చెట్ల కొమ్మలు విద్యుత్‌ వైర్లకు తాకి షాక్‌ కొట్టే ప్రమాదం ఉంది.

● వ్యవసాయ నిమిత్తం, గృహాల్లో అతుకులు లేని సర్వీస్‌ వైరును మాత్రమే ఉపయోగించాలి.

● తెగిపడిన, వేలాడుతున్న, వదులుగా, తక్కువ ఎ త్తులో ఉన్న విద్యుత్‌ తీగలను తాకవద్దు, వెంటనే సంబంధిత విద్యుత్‌ సిబ్బందికి తెలియజేయాలి.

● ఎవరికై నా పొరపాటున కరెంట్‌ షాక్‌ కొడితే దగ్గరలోని వ్యక్తులు షాక్‌కు గురైన వ్యక్తిని రక్షించాలన్న అత్రుతతో ప్రమాదం బారిన పడిన వ్యక్తిని ముట్టుకోవద్దు.

● రైతులు పంపు సెట్లను వాడుతున్నప్పుడు కరెంట్‌ మోటార్లకు కానీ, పైపులను కానీ, ఫుట్‌ వాల్వులను ఏమర పాటుతో తాకకూడదు. వ్యవసాయ పంపు సెట్లను, స్టార్టర్లను విధిగా ఎర్త్‌ చేయాలి. విద్యుత్‌ ప్రమాదాలు ఎర్త్‌ చేయబడని పరికరాల వల్లే జరుగుతాయి. ఎర్త్‌ చేయబడని మోటార్లు, స్టార్టర్లు, జీఐ పైపులు, ఫుట్‌ వాల్వ్‌లు తాకడం అత్యంత ప్రమాదకరం.

● డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద అనధికారంగా ఫ్యూజులు మార్చడం, రిపేర్‌ చేయడం, ఏబీ స్విచ్‌లు ఆపరేట్‌ చేయడం, కాలిన తీగలను సరిచేయడం ప్రమాదకరం.

● మోటారు పంపుసెట్లకు ఏదైనా సాంకేతిక లోపం తలెత్తితే సొంతగా సరిచేద్దామని ప్రయత్నిస్తే ప్రాణనష్టం, హాని జరగవచ్చు. మోటారు రిపేర్‌ తెలిసిన వారిచేతనే చేయించాలి.

● గ్రామీణ వినియోగదారులు తమ పరిధిలోని క్షేత్రస్థాయి విద్యుత్‌ సిబ్బందికి లైన్‌మెన్‌, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌, సీనియర్‌ లైన్‌ ఇన్‌స్పెక్టర్‌, సబ్‌ ఇంజనీర్‌, సెక్షన్‌ ఆఫీసర్లను సంప్రదించి వారి సేవలను పొందాలి.

● ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, రక్షణ పరికరాలు అందుబాటులో వచ్చిన ప్రస్తుత తరుణంలో వాటిని వినియోగించడం ద్వారా ప్రమాదాల నుంచి బయటపడవచ్చు.

● విద్యుత్‌ పరికరాలు, వైరింగ్‌, వ్యవసాయ మోటార్లు, స్టార్టర్లు బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ గుర్తింపు కలిగినవి వాడాలి.

విద్యుత్‌ వినియోగంలో

అప్రమత్తత అవసరం

ఆదమరిస్తే అంతే సంగతులు

సొంతంగా మరమ్మతు చేయవద్దు..

విస్తృత అవగాహన కల్పిస్తున్న అధికారులు

విద్యుత్‌ వినియోగదారులు : 4,86,266

ఇందులో గృహ విద్యుత్‌ వినియోగదారులు : 3,61,540

వ్యవసాయ వినియోగదారులు : 67,573

విద్యుత్‌ సబ్‌స్టేషన్లు : 74

డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు : 12,489

వినియోగదారులు : 4,20,925

ఇందులో గృహ వినియోగదారులు : 2,99,091

వ్యవసాయ వినియోగదారులు : 70,853

విద్యుత్‌ సబ్‌స్టేషన్లు : 76

డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు : 12,467

జీరో విద్యుత్‌ ప్రమాదాలే లక్ష్యంగా సర్కిల్‌లోని డీఈ టెక్నికల్‌ ఆధికారులను సేఫ్టీ అధికారులుగా నియమించి విద్యుత్‌ ప్రమాదాల నివారణకు టీజీ ఎన్పీడీసీఎల్‌ యాజమాన్యం కృషి చేస్తోంది. పొ లం బాట ద్వారా రైతులకు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నారు. రైతులు, వినియోగదారులు ఎట్టి పరిస్థితుల్లో సంస్థ చేయాల్సిన విద్యుత్‌ పనులు సొంతగా చేయొద్దని అధికారులు చెబు తున్నారు. భద్రతపై ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ, సిబ్బందికి అన్ని రకాల భ ద్రత పరికరాలు హెల్మెట్‌, గ్లౌవ్స్‌, పోర్టబుల్‌ ఎర్తింగ్‌, షార్ట్‌ సర్క్యూట్‌ కిట్లు, సేఫ్టీ షూస్‌, ఇన్సులేటె డ్‌ టూల్స్‌, ఓల్టేజ్‌ డిటెక్టర్‌ వంటివి అందించారు.

మంగళవారం శ్రీ 19 శ్రీ ఆగస్టు శ్రీ 20251
1/3

మంగళవారం శ్రీ 19 శ్రీ ఆగస్టు శ్రీ 2025

మంగళవారం శ్రీ 19 శ్రీ ఆగస్టు శ్రీ 20252
2/3

మంగళవారం శ్రీ 19 శ్రీ ఆగస్టు శ్రీ 2025

మంగళవారం శ్రీ 19 శ్రీ ఆగస్టు శ్రీ 20253
3/3

మంగళవారం శ్రీ 19 శ్రీ ఆగస్టు శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement