
హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో మోస్తరు వర్షం
హన్మకొండ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, వాయుగుండం కారణంగా నాలుగు రోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. సోమవారం రోజంతా ఆకాశం మేఘావృతమై ఉంది. హనుమకొండ, వరంగల్ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. సోమవారం ఉదయం 8.30 నుంచి రాత్రి 9 గంటల వరకు ఆటోమెటిక్ వెథర్ స్టేషన్‌లో నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ విడుదల చేసింది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మేడిపల్లిలో 25.8 మిల్లీ మీటర్లు, దుగ్గొండిలో 23.5, ఖానాపూర్ మండలం మంగలవారిపేటలో 23.5, నల్లబెల్లిలో 23.3, చెన్నారావుపేటలో 22, వరంగల్ పైడిపల్లిలో 18.5, గీసుకొండలో 15.8, గీసుకొండ మండలం గొర్రెకుంటలో 15.5, నర్సంపేట మండలం లక్నేపల్లిలో 15,3, వరంగల్ ఉర్సులో 13.3, నెక్కొండలో 13, కాశిబుగ్గలో 12.5, రాయపర్తిలో 3.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. హనుమకొండ జిల్లా దామెరలో 19.8, పరకాలలో 19.8, ఆత్మకూరులో 17.3, దామెర మండలం పులుకుర్తిలో 17, శాయంపేటలో 16.8, నడికూడలో 15.8, కాజీపేటలో 15.5, కమలాపూర్‌లో 13.3, ధర్మసాగర్‌లో 12, ఐనవోలులో 12, మడికొండలో 10.3, ఐనవోలు మండలం కొండపర్తిలో 10.3, హసన్‌పర్తి మండలం నాగారంలో 10, ఎల్కతుర్తిలో 10, భీమదేవరపల్లిలో 9, వేలేరులో 8.8, ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాలలో 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.