
యూరియా రైతులందరికీ అందాలి
న్యూశాయంపేట: వానాకాలం పంట సాగుకు అవసరమైన యూరియా రైతులకు చేరేలా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ సచివాలయం నుంచి ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్‌రావుతో కలిసి యూరియా, ఎరువుల లభ్యతపై కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారద పాల్గొని మాట్లాడుతూ..లక్షా అరవై వేల మంది రైతులకు సరిపడా 20వేల588 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు కేటాయించగా ఇప్పటివరకు 19వేల545 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేశామన్నారు. ఇంకా ప్రైవేటు, పీఏసీఎస్‌లో వెయ్యి 43 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందని పేర్కొన్నారు. యూరియా కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని సెంటర్లపై వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షించి నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రికి వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీసీపీ అంకిత్‌కుమార్, జిల్లా అధికారులు రామిరెడ్డి, అనురాధ, సత్యపాల్‌రెడ్డి, ఉమారాణి, తదితర అధికారులు పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో
మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు