
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక
నర్సంపేట: ఇంటర్నేషనల్ స్కూల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వరంగల్‌లోని ఓ సిటీ గ్రౌండ్‌లో జరిగిన జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో నర్సంపేట పట్టణానికి చెందిన విజ్‌డమ్ విద్యార్థులు పాల్గొని ప్రతిభను కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల డైరెక్టర్ జావేద్ తెలిపారు. ఈసందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈనెల 20, 21న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం గురుకుల విద్యాపీట్ హైస్కూల్‌లో జరిగే పోటీల్లో పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి ఎ.చందన, తొమ్మిదో తరగతికి చెందిన బి.రాంప్రసాద్ పాల్గొననున్నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభను కనబర్చి జాతీయ స్థాయిలో రాణించడం తమ లక్ష్యమని విద్యార్థులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభకనబర్చిన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ జావేద్, కరస్పాండెంట్ జహంగీర్, అకాడమిక్ ఇన్‌చార్జి నాజియాఇక్బాల్, వైస్‌ప్రిన్సిపల్ ప్రకాశ్, ప్రీస్కూల్ ప్రిన్సిపల్ ఫహీంసుల్తానా, కోచ్ రాజేష్, మధు, ప్రశాంత్‌కుమార్, రియాజ్‌లతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.