
సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి
ఖానాపురం: సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ప్రకాశ్ సూచించారు. ఈమేరకు మండల కేంద్రంలోని పీహెచ్‌సీని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి సూచనలు చేశారు. ఐనపల్లిలోని ఎంజేపీలో జరుగుతున్న కిషోరరక్ష కార్యక్రమాన్ని పరిశీలించి విద్యార్థినులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను తప్పకుండా అమలయ్యే చూడాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీల సంఖ్య పెంచాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా వైద్య శిబిరాలను నిర్వహించాలన్నారు. ప్రతీ ఒక్కరు కాచిచల్లార్చిన నీటిని తాగాలన్నారు. కార్యక్రమంలో పల్లె దవాఖాన డాక్టర్లు కల్పన, సునీత, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రాజయ్య, సిబ్బంది అన్నపూర్ణ, దివ్య, సతీశ్, భాస్కర్, జ్యోతి, ప్రిన్సిపల్ జయశ్రీ, తదితరులు పాల్గొన్నారు.