
పాపన్నగౌడ్ ఆశయాలను కొనసాగించాలి
న్యూశాయంపేట: సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ఆశయాలను కొనసాగించాలని కలెక్టర్ సత్యశారద పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పాపన్నగౌడ్ 375వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ పాపన్న చిత్రపటానికి కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల కోసం పోరాడిన నేతగా పాపన్న పేరు ప్రఖ్యాతులు సంపాదించారని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు విజయలక్ష్మి, రాంరెడ్డి, పుష్పలత, 41వ డివిజన్ కార్పొరేటర్ పోశాల పద్మ, గౌడ సంఘం నాయకులు రమేశ్, వెంకటేశ్వర్లు, లక్ష్మినారాయణ, రాందాస్, యాదగిరి, రాజు,రాజేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.