
స్థానిక సమస్యలు పరిష్కరించాలి
నర్సంపేట: స్థానిక సమస్యలపై సర్వేలు చేసి సర్వేలో వచ్చిన సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటాలు నిర్వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జి.నాగయ్య అన్నారు. ఈమేరకు పట్టణంలో సీపీఎం జిల్లా స్థాయి రూరల్ ప్రాంత వర్క్‌షాప్ సోమవారం సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కోరబోయిన కుమారస్వామి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, మంచినీరు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక, వీధి లైట్లు కుక్కలు, కోతుల సమస్యలతో ఇలాంటి అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య, జిల్లా కమిటీ సభ్యులు ఈసంపల్లి బాబు, భూక్య సమ్మయ్య, నమిండ్ల స్వామి, హన్మకొండ శ్రీధర్, బోళ్ల సాంబయ్య, మండల నాయకులు అక్కపెల్లి సుధాకర్, పుచ్చకాయల నర్సింహారెడ్డి, ఎస్‌కే అన్వర్, పెండ్యాల సారయ్య, కందికొండ రాజు, నర్సింహస్వామి తదితరులు పాల్గొన్నారు.