వర్ధన్నపేటకు మీనాక్షి నటరాజన్‌ | - | Sakshi
Sakshi News home page

వర్ధన్నపేటకు మీనాక్షి నటరాజన్‌

Aug 18 2025 5:29 AM | Updated on Aug 18 2025 5:29 AM

వర్ధన్నపేటకు మీనాక్షి నటరాజన్‌

వర్ధన్నపేటకు మీనాక్షి నటరాజన్‌

కలెక్టరేట్‌లో నేడు ప్రజావాణి

ఖరారైన పాదయాత్ర షెడ్యూల్‌

వర్ధన్నపేట: ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ పాదయాత్ర షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల 25న సాయంత్రం వర్ధన్నపేటకు చేరుకుని పాదయాత్ర నిర్వహించనున్నారు. 26న ఉదయం శ్రమదానం, కార్మికులతో సమావేశం కానున్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కార్యక్రమం ఉంటుందని ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు ఆదివారం తెలిపారు. కార్యక్రమాలను విజయవంతం చేయడానికి విస్తృతంగా ఏర్పాట్లు చేయనున్నట్లు, ఈ పనులను ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు పర్యవేక్షిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పాదయాత్రలో గ్రామస్థాయిలో ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ భవిష్యత్తు ప్రణాళికలను కూడా ప్రజలకు వివరిస్తారు. మహేశ్‌కుమార్‌ గౌడ్‌, మీనాక్షి నటరాజన్‌ పర్యటన నేపథ్యంలో వర్ధన్నపేటలో పండుగ వాతావరణం నెలకొంటుందని, కార్యక్రమానికి భారీగా ప్రజలు, కార్యకర్తలు హాజరవుతారని భావిస్తున్నారు.

సాక్షి ఫొటోగ్రాఫర్లకు

రాష్ట్రస్థాయి అవార్డులు

హన్మకొండ కల్చరల్‌/జనగామ: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని సాక్షి ఫొటోగ్రాఫర్లను రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపిక చేశారు. వరంగల్‌కు చెందిన సాక్షి సీనియర్‌ స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌ పెద్దపల్లి వరప్రసాద్‌, జనగామ ఫొటోగ్రాఫర్‌ గోవర్ధనం వేణుగోపాల్‌ ఉత్తమ వార్త చిత్రాల పోటీల్లో బహుమతులకు ఎంపికయ్యారు. తెలంగాణ స్టేట్‌ ఫొటో జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 19న హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో వారికి అవార్డులు ప్రదానం చేయనున్నారు.

న్యూశాయంపేట: ప్రజాసమస్యల పరిష్కారంలో భాగంగా వరంగల్‌ కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ప్రజావాణిలో ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవాలని తెలిపారు.

నేడు నులిపురుగుల

నివారణ కార్యక్రమం

గీసుకొండ: జిల్లాలో నులిపురుగుల నివారణ కోసం 0–19 సంవత్సరాల వారికి ఆల్బెండజోల్‌ మాత్రలు వేసే కార్యక్రమాన్ని చేపట్టినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ బి.సాంబశివరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11న ఆల్బెండజోల్‌ మాత్రలు వేసుకోని వారికి సోమవారం వేస్తారన్నారు. 0–2 సంవత్సరాల వయస్సులోపు వారికి సగం ట్యాబ్లెట్‌ను నీళ్లలో వేసి తాగించాలని, ఆపైన వయస్సు నుంచి 19 ఏళ్ల లోపు వారు పూర్తి ట్యాబ్లెట్‌ను నమిలి మింగాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో చేపట్టే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వైద్యాధికారులు, సిబ్బంది, సంబఽంధిత శాఖల వారు కృషి చేయాలని కోరారు. కార్యక్రమాన్ని డీఐవో డాక్టర్‌ ప్రకాశ్‌ పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు.

డీఈఈసెట్‌–25 స్పాట్‌ అడ్మిషన్లు

విద్యారణ్యపురి: పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు 2025–27 విద్యాసంవత్సరానికి డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఎల్‌ఈడీ) రెండేళ్ల కోర్సు కళాశాలల్లో (ప్రభుత్వ, ప్రైవేట్‌) వారీగా స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా విద్యాశిఽక్షణా సంస్థ ప్రధానాచార్యుడు ఎండీ అబ్దుల్‌హై ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏ కళాశాలలోనూ (ప్రభుత్వ, ప్రైవేట్‌) సీటు పొందలేద ని రిపోర్ట్‌, జాయిన్‌ కాని అభ్యర్థులు మాత్రమే స్పాట్‌ అడ్మిషన్ల ప్రక్రియకు హాజరుకావాల న్నారు. వరంగల్‌, హనుమకొండలో విద్యాశిక్షణ సంస్థలో ఖాళీ సీట్లలోనే భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ డైట్‌ కళాశాలలో స్పాట్‌ అడ్మిషన్లకు ఈనెల 19న హాజరు కావాలని, ఈ నెల 21న సీటు పొందిన అభ్యర్థులు కాలేజీలో రిపోర్టు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రైవేట్‌ డైట్‌ కళాశాలల్లో ఈనెల 20న స్పాట్‌ అడ్మిషన్లకు హాజరు కావాల్సి ఉంటుందని, సీటు పొందినవారు 21న కళాశాలలో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుందన్నారు. వివరాలకు హెచ్‌టీటీపీఎస్‌//డీఈఈసెట్‌,సీడీఎస్‌ఈ.తెలంగాణ. గౌట్‌.ఇన్‌ వెబ్‌సైట్‌ను చూడాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement