
ప్రజలకు అందుబాటులో ఉండాలి
నర్సంపేట: వైద్య సిబ్బంది ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వైద్యసేవలు అందించాలని వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సాంబశివరావు సూచించారు. ఈమేరకు చెన్నారావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపై వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో సీహెచ్‌ఓ భద్రయ్య, స్టాఫ్‌నర్స్ హేమలత, హెల్త్ అసిస్టెంట్ శివాజీ తదితరులు పాల్గొన్నారు.
సమయపాలన పాటించాలి..
ఖానాపురం: వైద్యాఆరోగ్యశాఖలో పనిచేసే ఉద్యోగులకు సెలవులు ఉండవని, సమయపాలన తప్పకుండా పాటించాలని జిల్లా వైద్యాఆరోగ్యశాఖ అధికారి సాంబశివరావు ఆదేశించారు. ఈమేరకు మండల కేంద్రంలోని పీహెచ్‌సీని ఆదివారం తనిఖీ చేశారు. ఈసందర్భంగా రికార్డులను పరిశీలించి సూచనలు చేశారు. త్వరలోనే ఫేషియల్ అటెండెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీసీ నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి
సాంబశివరావు