
జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం
– 8లోu
మహిళా సంఘాలకు లక్ష్యానికి మించి రుణాలు..
సాక్షి వరంగల్/ఖిలా వరంగల్: జిల్లా సమగ్రాభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. వరంగల్ నగరాన్ని రెండో రాజధానిగా గుర్తించి హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతోనే రాష్ట్ర ప్రభుత్వం రూ.5వేల కోట్లు కేటాయిందని గుర్తుచేశారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపొందించామని పేర్కొన్నారు. ఖిలా వరంగల్ మధ్యకోటలోని ఖుష్‌మహల్ మైదానంలో కలెక్టర్ సత్యశారద అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన 79వ స్వాతంత్య్ర దినోత్సవంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రత్యేక వాహనంపై కలెక్టర్ సత్యశారద, ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్‌తో కలిసి మంత్రి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2057 నగర జనాభాను దృష్టిలో పెట్టుకుని త్వరలోనే రూ.4,100 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ పనులు ప్రారంభిస్తామని, మామునూరు విమానాశ్రయం కల త్వరలో సాకారం చేస్తామని, ఎయిర్‌పోర్ట్ నిర్మాణంతో ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల ప్రజలకు ప్రయోజనం ఉంటుందని స్పష్టం చేశారు. భూ సేకరణకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.205 కోట్లు విడుదల చేసిందని చెప్పారు.
గత ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా శంకుస్థాపన చేసి గాలికి వదిలేసిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు వేగవంతం చేశామని, నర్సంపేటలో వైద్య కళాశాల, జిల్లా ఆస్పత్రిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ప్రారంభించుకున్నామని తెలిపారు. కలెక్టరేట్ పనులు తదిదశకు చేరాయని, అధునాతన సౌకర్యాలతో వరంగల్ బస్టాండ్ నిర్మిస్తున్నామని, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు పనులు త్వరలోనే పూర్తి చేస్తామని వివరించారు. అటవీ శాఖ ద్వారా గత ఏడాది 26 లక్షల మొక్కలు నాటామని, ఈ ఏడాది 31 లక్షల మొక్కలు నాటాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయని చెప్పారు. పాకాల బయోడైవర్సిటీ పార్కు అభివృద్ధి, భద్రకాళి ఆలయ మాడవీధులు, రాజగోపురాల పనులు సాగుతున్నాయని స్పష్టం చేశారు. మహాలక్ష్మి పథకం కింద కోట్లాది మంది మహిళలు ఉచిత బస్సు సౌకర్యం పొందుతున్నారని, గృహలక్ష్మితో రూ.500కు సిలిండర్లు అందుకుంటున్నారని, గృహజ్యోతి కింద లక్ష మందికిపైగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వినియోగించుకుంటున్నారని తెలిపారు.
వరంగల్‌ను రెండో రాజధానిగా గుర్తిసాం
మామునూరు విమానాశ్రయం
కల త్వరలో సాకారం
79వ స్వాతంత్య్ర దినోత్సవంలో
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
మధ్యకోటలోని ఖుష్‌మహల్ మైదానంలో జాతీయ జెండావిష్కరణ
అలరించిన పాఠశాల విద్యార్థుల
సాంస్కృతిక ప్రదర్శనలు
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు వేగవంతం..
ఉత్తములకు
ప్రశంసపత్రాలు

జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం