
డీలర్లు లైసెన్స్ కలిగి ఉండాలి
● వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
వర్ధన్నపేట: డీలర్లు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని, 1985 ఎరువుల నియంత్రణ చట్టం నియమనిబంధనలు పాటించాలని, పీఓఎస్ మిషన్ ద్వారా మాత్రమే అమ్మకాలు చేపట్టాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సూచించారు. ఉప్పరపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో శుక్రవారం ఎరువుల విక్రయ కేంద్రాన్ని ఎమ్మెల్యే నాగరాజు ప్రారంభించి మాట్లాడారు. ప్రాథమిక సహకార సంఘాలు, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలు, ఓడీసీఎంఎస్ కేంద్రాలు, ప్రైవేట్ దుకాణాల్లో రైతులకు ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతి రైతు దగ్గర నుంచి ఆధార్‌కార్డు వివరాలు సేకరించి మాత్రమే ఎరువుల విక్రయాలు జరపాలని ఆదేశించారు. అలాగే, వ్యవసాయశాఖ అధికారులు నిరంతరం విక్రయ కేంద్రాలను తనిఖీలు చేయాలని, క్షేత్రస్థాయిలోఎరువుల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.