నర్సంపేట రూరల్: షార్ట్ సర్క్యూట్‌తో మొక్కజొన్న పంట దగ్ధమైన సంఘటన నర్సంపేట మండలంలోని పర్శనాయక్‌తండాలో మంగళవారం సాయంత్రం జరిగింది. బాధితుడి కథనం ప్రకారం.. పర్శనాయక్‌తండాకు చెందిన కొర్ర శోభన్‌కు 1.20 ఎకరాల భూమి ఉంది. పైన ఉన్న 11కేవీ తీగల నుంచి షార్ట్‌సర్క్యూట్ అయి మంటలు చెలరేగాయి. దీంతో పంట మొత్తం కాలిపోయింది. అంతేకాకుండా రెండు బోరు మోటార్లు, పైపులైన్లు పూర్తిగా కాలిపోయాయని, వీటి విలువ సుమారు రూ.4.5 లక్షలు ఉంటుందని బాధితుడు రోదిస్తూ తెలిపాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.
లా పరీక్షలో 11 మంది డీబార్
కేయూ క్యాంపస్: కేయూ పరిధిలో మూడేళ్ల లా కోర్సు మొదటి సెమిస్టర్ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో కాపీయింగ్ చేస్తూ పట్టుబడిన 11 మంది విద్యార్థులను డీబార్ చేసినట్లు ఆకళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జి.రాజారెడ్డి తెలిపారు. పరీక్షల నిర్వహణ తీరును కేయూ రిజిస్ట్రార్ మల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ రాధిక పరిశీలించారు.