
బుధవారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్ శ్రీ 2024
ట్యూషన్లు చెబుతూ.. ప్రిపేర్ అవుతూ
చివరి ప్రయత్నంలో సాధించాను..
మన చేతిలో ఉన్న ప్రాసెస్‌ను గట్టిగా నమ్మితే విజయం
సాధించడం సాధ్యం. ఆరోసారి చివరిగా నాకు ఇష్టమైన
ఐపీఎస్ సాధించాలని విరామం లేకుండా ప్రతీ రోజు
5 నుంచి 6 గంటలు ప్రిపేరయ్యా. గంటల కొద్దీ చదవడం
కంటే రోజూ కొంత సమయం కేటాయించి ప్రిపేరై విజయం సాధించా. సివిల్స్ రాయడానికి నాకు ఇంకో అవకాశం లేదు. చివరి ప్రయత్నంలో విజయం సాధించా.
సయింపు కిరణ్‌ది మధ్య తరగతి కుటుంబం. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతూ మరో వైపు యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఆన్‌లైన్‌లో ట్యూషన్లు చెప్పి సొంత ఖర్చులు వెళ్లదీసుకున్నారు. ఒకవైపు ప్రిపరేషన్.. మరో వైపు బోధన ఐపీఎస్ సాధించడంలో అనుకూలించాయి. ఆయన ఆన్‌లైన్ క్లాసులకు అటెండ్ అయిన పలువురు ఉన్నత ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
– సయింపు కిరణ్, 568వ ర్యాంకర్, గీసుకొండ
న్యూస్‌రీల్