గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌కు దోహదం | - | Sakshi
Sakshi News home page

గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌కు దోహదం

Mar 29 2023 1:40 AM | Updated on Mar 29 2023 1:40 AM

మాట్లాడుతున్న నిట్‌ డైరెక్టర్‌ ఎన్వీ రమణారావు - Sakshi

మాట్లాడుతున్న నిట్‌ డైరెక్టర్‌ ఎన్వీ రమణారావు

కాజీపేట అర్బన్‌: భారత ప్రభుత్వ జాతీయ గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌కు దోహదపడే వేదికగా మాలిక్యూలర్‌ మెటీరియల్స్‌పై నిర్వహిస్తున్న అంతర్జాతీయ వర్క్‌షాప్‌ నిలవాలని నిట్‌ డైరెక్టర్‌ ఎన్వీ.రమణారావు తెలిపారు. నిట్‌ వరంగల్‌లోని బోస్‌ సెమినార్‌ హాల్‌లో మంగళవారం కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో హిబ్రూ యూనివర్సిటీ ఆఫ్‌ జెరూసలేం, ఇజ్రాయిల్‌, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖస్పార్క్‌ ( స్కీమ్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ అకాడమిక్‌ అండ్‌ రీసెర్చ్‌ కొలాబరేషన్‌) సౌజన్యంతో మాలిక్యూలర్‌ మెటీరియల్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ అనే అంశంపై ఏర్పాటు చేసిన ఐదు రోజుల అంతర్జాతీయ సదస్సును ఎన్వీ.రమణారావు ప్రారంభించి మాట్లాడారు. కెమిస్ట్రీ విభాగంలో నూతన ఆవిష్కరణలు చేపట్టేందుకు, ఆలోచనలకు వర్క్‌షాప్‌ను సద్వినియోగపరచుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఐఐటీ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ సుబ్రహ్మణ్యం, డీన్‌ జయకృష్ణ, కాశీనాథ్‌, నాగరాజన్‌ తదితరులు పాల్గొన్నారు.

సీబీకేఆర్‌–23 ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌

నిట్‌ వరంగల్‌లోని అంబేద్కర్‌ లర్నింగ్‌ సెంటర్‌ ఆడిటోరియంలో సివిల్‌ ప్రొఫెసర్‌ కామేశ్వర్‌రావు ఉద్యోగ విరమణ సందర్భంగా సీబీకేఆర్‌–23 (సిమెంట్‌ అండ్‌ బిల్డింగ్‌ కాంక్రీట్‌ ఫర్‌ ఎ సస్టేయినబుల్‌ రెసిలెంట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌) ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేశారు. రెండు రోజులపాటు జరిగే ఈ కాన్ఫరెన్స్‌ను ఐఐటీ తిరుపతి డైరెక్టర్‌ కలిదండి సత్యనారాయణ, నిట్‌ డైరెక్టర్‌ ఎన్వీ.రమణారావులు ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు రతీష్‌కుమార్‌, వెంకటేశ్వరరావు, తేజస్వీ, రవిప్రసాద్‌ పాల్గొన్నారు.

నిట్‌ డైరెక్టర్‌ ఎన్వీ.రమణారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement