‘దయ్యాల పార్టీని దరిదాపుల్లోకి రానివ్వొద్దు’ | - | Sakshi
Sakshi News home page

‘దయ్యాల పార్టీని దరిదాపుల్లోకి రానివ్వొద్దు’

Nov 19 2026 12:37 PM | Updated on Nov 19 2026 12:37 PM

ఖిల్లాఘనపురం: పదేళ్ల పాటు రాక్షస పాలన సాగించిన దయ్యాలపార్టీ(బీఆర్‌ఎస్‌)ని దరిదాపుల్లోకి రానివ్వొద్దని.. ప్రజల సంక్షేమం కోరే కాంగ్రెస్‌పార్టీని ఆదరించాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పద్మశాలి కళ్యాణ మండపంలో చేయూత పింఛన్‌ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌, డీసీసీ ఉపాధ్యక్షుడు సాయిచరణ్‌రెడ్డితో కలిసి 648 మంది చేయూత లబ్ధిదారులకు మంజూరు పత్రాలతో పాటు 33 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు, డిజిటల్‌ రేషన్‌ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పింఛన్ల కోసం దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారని, వారి కల నేటితో సాకారమైందని చెప్పారు. లబ్ధిదారుల ఖాతాల్లో గురువారం పింఛన్‌ డబ్బులు జమవుతాయని తెలిపారు. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపు వారికి ఇందిరమ్మ కుటుంబ జీవితబీమా పథకాన్ని గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లాంచనంగా ప్రారంభిస్తారని, కుటుంబ యజమాని మరణిస్తే రూ.5 లక్షలు అందనున్నాయని చెప్పారు. రాష్ట్రంలో సాగునీరు, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్‌, ఇందిరమ్మ ఇళ్లు తదితర ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డిదేనన్నారు. మండల ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న డిగ్రీ కళాశాల త్వరలో మంజూరు కానుందని.. సోళీపురంలో సింగిల్‌విండో ఏర్పాటు చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన పథకాలను కొనసాగిస్తూనే కొత్త వాటిని అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ సుగుణ, ఎంపీడీఓ విజయసింహారెడ్డి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ క్యామ నవనీత, సింగిల్‌విండో చైర్మన్‌ మురళీధర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ క్యామ రాజు, ఆగారం పద్మమ్మ, వెంకటేశ్వరరావు, డీలర్‌ రమేష్‌, ఆగారం ప్రకాష్‌, కృష్ణయ్య, లింగస్వామి, నవీన్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement