రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు

Nov 19 2026 12:37 PM | Updated on Nov 19 2026 12:37 PM

కొత్తకోట రూరల్‌: ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడంతో పాటు నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో సమర్థవంతంగా పనిచేయాలని ఎస్పీ సునీతారెడ్డి ఆదేశించారు. బుధవారం కొత్తకోట సర్కిల్‌ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి పోలీస్‌స్టేషన్ల పనితీరు, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, పెండింగ్‌ కేసుల దర్యాప్తు, పురోగతి, రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 44వ నంబర్‌ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ట్రాఫిక్‌ నియంత్రణ, వాహనాల తనిఖీలు, రోడ్డు భద్రత నిబంధనల అమలుపై నిరంతరం దృష్టి సారించాలని ఆదేశించారు. పోలీస్‌స్టేషన్లలో నమోదైన కేసుల దర్యాప్తును వేగవంతం చేసి పెండింగ్‌ కేసులను నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా పోక్సో కేసుల దర్యాప్తును 60 రోజుల్లోగా పూర్తిచేసి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలన్నారు. సైబర్‌ నేరాల్లో సాంకేతిక ఆధారాలను సమర్థవంతంగా సేకరించి విచారణను వేగవంతం చేయాలని కోరారు. నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని, దర్యాప్తులో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నారు. బాధితులు ఏ పోలీస్‌స్టేషన్‌కు వచ్చినా జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు విషయంలో నిర్లక్ష్యం సరికాదని తెలిపారు. కోర్టు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ చార్జిషీట్లు, సాక్షుల హాజరు, కేసుల పురోగతి, కోర్టు ఆదేశాల అమలుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులను మర్యాదగా పలకరించి వారి సమస్యలను ఓర్పుతో విని సకాలంలో స్పందించాలన్నారు. రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరు, క్రమశిక్షణ, విధుల నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఈవ్‌టీజింగ్‌, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, గంజాయి విక్రయాలు, చోరీలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరిస్తూ అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే డయల్‌ 112 లేదా సమీప పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement