పేద, మధ్యతరగతి కుటుంబాలకు బీమా భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం ప్రారంభించనున్న ఇందిరమ్మ జీవితబీమా పథకం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోనుంది. రాష్ట్రంలోని సుమారు 1.35 కోట్ల కుటుంబాలకు ఈ పథకం భరోసా కల్పించనుంది. రేషన్‌కార్డు ఉన్నా.. లేకున్నా.. బీమా వర్తింపజేసేలా నిబంధనలు రూపొందించారు. ఇలాంటి ప్రజా ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా భాగస్వామి కావడం చాలా గర్వంగా ఉంది. ఈ అవకాశాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలి. అందుకు ప్రభుత్వం, అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసేలా ఆదేశాలిచ్చాం.
– తూడి మేఘారెడ్డి, ఎమ్మెల్యే, వనపర్తి
ప్రభుత్వం పేద, మధ్య తరగతి కుటుంబాల కోసం గురువారం నుంచి అమలు చేయనున్న ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని అర్హులైన కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలి. ఇందుకుగాను 268 గ్రామపంచాయతీలు, 80 పుర వార్డుల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేసి రేషన్‌కార్డు ప్రాతిపదికన దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎలాంటి సందేహాలున్నా.. దరఖాస్తు కౌంటర్లలో అడిగి తెలుసుకోవాలి.
– ఆదర్శ్ సురభి, కలెక్టర్
●


