వనపర్తిటౌన్: సమగ్ర కులగణనతోనే ప్రతి కులానికి న్యాయం జరుగుతుందని, బీసీలకు జనాభా ప్రాతిపదికన తగిన ప్రాతినిథ్యం కల్పించేందుకు ప్రతి కులాన్ని ప్రత్యేకంగా లెక్కించాలని ఆలిండియా కులగణన సమన్వయ కమిటీ సభ్యుడు, ఏఐఓబీసీ జాతీయ కార్యదర్శి పెండెం జయంత్‌యాదవ్ కోరారు. బుధవారం ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి నవంబర్ 28న ఢిల్లీలోని రాంలీలా మైదాననంలో నిర్వహించే ‘ఛలో రాంలీలా మైదాన్’ ఉద్యమానికి మద్దతు కోరినట్లు తెలిపారు. ప్రతి కులానికి ప్రత్యేక డ్రాప్‌డౌన్ ఆప్షన్‌న్‌తో పాటు గుర్తింపు కోడ్ కేటాయించి శాసీ్త్రయంగా కులగణన నిర్వహించాలని కోరగా.. అందుకు జగన్‌మోహన్‌రెడ్డి సానుకూలంగా స్పందించి ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించడంతో పాటు తమ పార్టీ తరఫున సైతం అండగా ఉంటామని హామీ ఇచ్చినట్లు వివరించారు. సమావేశంలో ప్రొ. సూరజ్ యాదవ్, ఆలిండియా ఓబీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు డా. కిరణ్, మహారాష్ట్ర ఓబీసీ మహామోర్చా కన్వీనర్ ఉమేష్ కొరం, రాకేష్ దత్తా, రజినీకాంత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


