‘సర్‌’ గడువు పొడగింపును వినియోగించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’ గడువు పొడగింపును వినియోగించుకోవాలి

Nov 19 2026 12:37 PM | Updated on Nov 19 2026 12:37 PM

వనపర్తి: ఎన్నికల సంఘం ఎస్‌ఐఆర్‌ గడువును డిసెంబర్‌ 22 వరకు పొడిగించిందని.. అర్హులైన ఓటర్లు సద్వినియోగం చేసుకునేలా రాజకీయ పార్టీలు ప్రజలకు అవగాహన కల్పించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ సూచించారు. బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు లేని వారికి కొనసాగింపు ప్రక్రియలో భాగంగా మరో అవకాశం కల్పించినట్లు వివరించారు. ముసాయిదా జాబితాలో పేర్లు లేని అర్హులైన ఓటర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకొని అవసరమైన పత్రాలను సమర్పించాలన్నారు. ఓటరు జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఉండేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా తమ పరిధిలో ప్రజలకు అవగాహన కల్పించాలని, ఓటరు నమోదు, అభ్యంతరాలు, సవరణలకు సంబంధించి ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో ఇప్పటి వరకు 29,272 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. ఇందులో సుమారు 27 వేలకుపైగా పరిశీలించి పరిష్కరించినట్లు వెల్లడించారు. మిగిలిన వాటిని కూడా నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిశీలించి 25వ తేదీన పట్టభద్రుల ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించనున్నట్లు, విడుదల అనంతరం కూడా నిబంధనల ప్రకారం ఓటరు నమోదుకు మరో అవకాశం కల్పించనున్నట్లు వివరించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి రాంరెడ్డి, ఆర్డీఓ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement