గోపాల్‌పేట: కరువు నెలకొందని రైతులు భయాందోళనకు గురికావద్దని.. ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టి అండగా నిలుస్తుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి గోపాల్‌పేటలోని ఓ గార్డెన్స్‌లో గోపాల్‌పేట, ఏదుల, రేవల్లిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు చేయూత పించన్ మంజూరు పత్రాలు, స్మార్ట్ రేషన్‌కార్డులు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందించారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ.. గోపాల్‌పేట, ఏదుల, రేవల్లి మండలాల్లో 1,100 మందికి కొత్త పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు. ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ జీవిత బీమా ద్వారా రూ.ఐదు లక్షలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటికే 5,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో కరువు పరిస్థితిని ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారని.. పరిస్థితులు ఎలా ఉన్నా గతంలో ఉన్న పథకాలను అమలు చేస్తూనే ప్రజలకు అవసరమైన పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. పేదలు, రైతులు, మహిళలకు అండగా ఉండటమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేష్, ఉపాధ్యక్షుడు సత్యశిలారెడ్డి, ఆయా మండలాల అధ్యక్షులు సుఖేందర్‌రెడ్డి, సుల్తాన్ అలీ తదితరులు పాల్గొన్నారు.


