అర్హులందరికీ సంక్షేమ ఫలాలు : ఎమ్మెల్యే | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు : ఎమ్మెల్యే

Nov 13 2026 12:40 AM | Updated on Nov 13 2026 12:40 AM

వనపర్తి రూరల్‌: అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. మార్నింగ్‌వాక్‌లో భాగంగా గురువారం మండలంలోని మెంటేపల్లిలో పర్యటించిన ఆయన స్మార్ట్‌ రేషన్‌ కార్డులు, కొత్త లబ్ధిదారులకు చేయూత, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. అలాగే గ్రామంలో నిర్మించిన నాలుగు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ వేడుకలకు హాజరై లబ్ధిదారులకు కొత్త దుస్తులు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రామంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం, గ్రామ ముఖద్వారం, వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, అర్హులకు రేషన్‌ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, రైతుభరోసా, రైతుబీమా, సన్నధాన్యానికి బోనస్‌, వడ్డీలేని రుణాలు, ఇందిరమ్మ ఇళ్ల వంటి అనేక పథకాలు అందిస్తూ ప్రజలకు అండగా నిలుస్తోందని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే ప్రజా సంక్షేమం, గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమని.. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని కొందరు ప్రభుత్వంపై అక్కడక్కడ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. డీఆర్డీఓ ఉమాదేవి, తహసీల్దార్‌ రమేష్‌రెడ్డి, ఎంపీడీఓ, సర్పంచ్‌ రాములు, కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు రవికిరణ్‌, మాజీ ఎంపీపి కిచ్చారెడ్డి, శంకర్‌నాయక్‌, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

రహదారి విస్తరణ త్వరగా పూర్తిచేయాలి..

వనపర్తిటౌన్‌: జిల్లాకేంద్రంలో కొనసాగుతున్న రహదారి విస్తరణ పనులను త్వరగా పూర్తిచేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరారు. గురువారం పొట్టి శ్రీరాములు చౌరస్తా వద్ద కొనసాగుతున్న పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో వేగం పెంచి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement