ఉత్తమ ఫలితాలు సాధించాలి : డీఐఈఓ | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ ఫలితాలు సాధించాలి : డీఐఈఓ

Nov 8 2026 10:42 AM | Updated on Nov 8 2026 10:42 AM

ఆత్మకూర్‌: ఇంటర్‌ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా అధ్యాపకులు తీర్చిదిద్దాలని జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి నరేంద్రకుమార్‌ అన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో స్టూడెంట్‌ కిట్లను 250 మంది విద్యార్థులకు అందజేశారు. అలాగే విద్యార్థులతో మాట్లాడి బోధనపై ఆరా తీశారు. కళాశాలలో రికార్డులను పరిశీలించి అధ్యాపకులతో సమావేశమయ్యారు. విద్యార్థులను వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయాలని, వారిలో ఉన్న భయాన్ని తొలగించి సులభతర బోధన చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ సైదులు, అధ్యాపకులు భాగ్యవర్ధన్‌రెడ్డి, టీజే విశ్వేశ్వర్‌, రాఘవేందర్‌రావు, శ్వేత, లలితమ్మ, చైతన్యరాణి, వీణ, స్వాతి, సునయన, విశ్వాస్‌, దేవదాస్‌, నారాయణచారి, సునీల్‌కుమార్‌రెడ్డి, పావని, కురుమూర్తి, రాఘవేందర్‌, రామన్‌గౌడ్‌, రమణకుమార్‌, రహీం, విద్యార్థులు ఉన్నారు.

మైనార్టీ నిరుద్యోగ యువతకు స్టడీ మెటీరియల్‌

వనపర్తి: మైనార్టీ నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షలపై అవగాహన కల్పించడంతో పాటు ఉద్యోగ అవకాశాలను మెరుగుపర్చే లక్ష్యంతో రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్‌, మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఉచిత స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేయనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. టీజీపీఎస్‌సీ గ్రూప్‌–1, 2, 3, 4తో పాటు టీజీపీఆర్బీ ఆధ్వర్యంలో నిర్వహించే పోలీస్‌ కానిస్టేబుల్‌, ఎస్‌ఐ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సంబంధించిన స్టడీ మెటీరియల్‌ అందజేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన మైనార్టీ నిరుద్యోగ యువత (ముస్లిం, సిక్కు, క్రిస్టియన్‌, జైన్‌, బౌద్ధ) తమ విద్యార్హతలు, అవసరమైన ధ్రువపత్రాల జిరాక్స్‌ ప్రతులతో ఈ నెల 12లోపు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని సూచించారు. మరిన్ని వివరాలకు 08545–232500, సెల్‌నంబర్‌ 72078 54914 సంప్రదించాలని జిల్లా అధికారి కోరారు.

పీయూలో కబడ్డీ,

చెస్‌ జట్ల ఎంపికలు

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: అంతర్‌ యూనివర్సిటీ కబడ్డీ, చెస్‌ పోటీల్లో పాల్గొనన్ను పీయూ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. శనివారం పీయూ వీసీ శ్రీనివాస్‌ ఎంపికలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. తమ ప్రతిభను చాటుకుని యూనివర్సిటీకి బంగారు పతకాలు సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎంపికై న విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement