‘సాగునీరు అందించని అసమర్థ ప్రభుత్వం’ | - | Sakshi
Sakshi News home page

‘సాగునీరు అందించని అసమర్థ ప్రభుత్వం’

Nov 8 2026 10:42 AM | Updated on Nov 8 2026 10:42 AM

గోపాల్‌పేట: ఎల్‌నినో సాకుతో రైతులకు సాగునీరు అందించని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్‌ అని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన బుద్దారం పాటిగడ్డతండాలో రైతు రాములునాయక్‌కు చెందిన ఎండిన వరి పంటను పరిశీలించారు. అనంతరం రైతుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం సాగునీరు, విద్యుత్‌ సక్రమంగా ఇస్తే రైతు నష్టపోయేవాడా అని ప్రశ్నించారు. రైతు ఆరు ఎకరాల్లో వరి సాగుచేస్తే విద్యుత్‌ సరఫరాలో అంతరాయంతో ట్రాన్స్‌ఫార్మర్లు పలుమార్లు కాలిపోవడం, నీరు సరిగా అందక మూడు ఎకరాల పంట ఎండిపోవడం దురదృష్టకరమన్నారు. మార్పు.. మార్పు.. అని ఓట్లు వేస్తే ప్రభుత్వం రైతులను నిండా ముంచుతోందని ఆరోపించారు. నీటిలభ్యత ఉన్నా ఆంధ్ర ప్రయోజనాల కోసం శ్రీశైలం నుంచి 110 టీఎంసీల నీరు దోచిపెట్టారన్నారు. అనంతరం రైతుకు తక్షణ సాయంగా రూ.ఐదు వేలు అందించారు. ఆయన వెంట స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement