వనపర్తి: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్–2026) ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితాలో పేర్లు నమోదు కాని అర్హులైన ఓటర్లకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించిందని.. ఈ నెల 21 వరకు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించవచ్చని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. అర్హులైన ఏ ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకుండా విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. శనివారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరం నుంచి ఆయన పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్‌లో భాగంగా ప్రచురించిన జాబితాలో గైర్హాజరు, చిరునామా మార్పు, మరణించడం తదితర కారణాలతో 38,564 మంది పేర్లు తొలగిపోయాయన్నారు. ఇందులో అర్హులైన ఓటర్లకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించిందని తెలిపారు. వీరికి ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్వోలు పంపిణీ చేస్తారని.. వారందరూ పూరించి నవంబర్ 21లోపు తిరిగి సమర్పించాల్సి ఉంటుందన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్‌ఓ రాంరెడ్డి, సంబంధిత ఎన్నికల అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


