గడువులోగా పనులు పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

గడువులోగా పనులు పూర్తి చేయాలి

Nov 7 2026 1:36 AM | Updated on Nov 7 2026 1:36 AM

కొత్తకోట రూరల్‌: అభివృద్ధి పనులు వేగంగా, నాణ్యతగా నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని శనిగ చెరువుకట్ట వద్ద కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పట్టణానికి సరఫరా అయ్యే ప్రధాన విద్యుత్‌లైన్‌ స్తంభాలు పనులకు అడ్డుగా ఉన్నాయని అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా వెంటనే విద్యుత్‌శాఖ అధికారులను అక్కడికి పిలిపించి సమస్యపై చర్చించారు. విద్యుత్‌ స్తంభాలను తొలగించి పక్కనే కొత్త లైన్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. అంతకుముందు మండలంలోని రామనంతాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్‌ నాయకులు మేసీ్త్ర శ్రీనివాసులు, పి.కృష్ణారెడ్డి, ఎన్‌జే బోయేజ్‌, డా. పీజే బాబు, పెంటన్నయాదవ్‌, సుభాష్‌, సలీంఖాన్‌, సంద వెంకటేష్‌, రాచాల వెంకటేష్‌, ముజీబ్‌, తయ్యబ్‌, కౌన్సిలర్లు చంద్రకాంత్‌, మురళి తదితరులు ఉన్నారు.

వాల్మీకులు రాజకీయంగా ఎదగాలి..

మదనాపురం: వాల్మీకులు అన్నిరంగాల్లో రాణించాలని.. ముఖ్యంగా రాజకీయంగా ఉన్నతస్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి ఆకాంక్షించారు. శుక్రవారం మండలంలోని కొత్తపల్లిలో మహర్షి వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. వాల్మీకుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌ రాజేష్‌ యాదవ్‌, స్థానిక ప్రజాప్రతినిధులు, వాల్మీకి సంఘం నాయకులు, యువత పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement