డంపింగ్‌యార్డు నిర్వహణకు పటిష్ట చర్యలు | - | Sakshi
Sakshi News home page

డంపింగ్‌యార్డు నిర్వహణకు పటిష్ట చర్యలు

Nov 5 2026 12:46 AM | Updated on Nov 5 2026 12:46 AM

వనపర్తి: జిల్లావ్యాప్తంగా జంతు జనన నియంత్రణ కార్యకలాపాలకు అవసరమైన అన్ని సదుపాయాలను ఒకేచోట ఏర్పాటు చేయాలని, అదేవిధంగా చెత్త వేరుచేసే ప్రక్రియను వేగవంతం చేసి డంపింగ్‌యార్డు నిర్వహణ వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎన్‌.ఖీమ్యానాయక్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన జిల్లాకేంద్రం సమీపంలోని నాగవరం శివారులో ఉన్న జంతు జనన నియంత్రణ కేంద్రం (ఎనిమల్‌ బర్త్‌ కంట్రోల్‌ సెంటర్‌)ను సందర్శించి అక్కడ కొనసాగుతున్న కార్యకలాపాలను పరిశీలించారు. వీధి కుక్కలకు జనన నియంత్రణ శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్న విధానం, వాటికి అందిస్తున్న వైద్యసేవలు, కేంద్రంలో ఉన్న సదుపాయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జంతు జనన నియంత్రణ కార్యక్రమాలను సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలన్నారు. జిల్లావ్యాప్తంగా జంతు జనన నియంత్రణ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు అవసరమైన అన్ని మౌలిక వసతులు, వైద్య సదుపాయాలు, ఇతర వసతులను ఒకేచోట ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం అక్కడే ఉన్న డంపింగ్‌యార్డును పరిశీలించి చెత్త వేరుచేసే విధానం, వ్యర్థాల నిర్వహణ తీరును పరిశీలించారు. చెత్త వేరు చేసే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, తడి, పొడి చెత్తను పద్ధతి ప్రకారం వేరుచేసి నిర్వహణకు పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. డంపింగ్‌యార్డులో జరిగిన అగ్నిప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు పునరావతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. డంపింగ్‌యార్డులో నిరంతర పర్యవేక్షణ ఉండాలని, వ్యర్థాల నిల్వ, నిర్వహణలో భద్రత ప్రమాణాలు పాటించాలన్నారు. ఆయన వెంట పుర కమిషనర్‌ నిరంజన్‌, సంబంధిత అధికారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement