మదనాపురం: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని, గర్భిణులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తూ పీహెచ్‌సీలపై నమ్మకం కలిగించాలని డీఎంహెచ్‌ఓ డా. భాస్కర్‌నాయక్ సూచించారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో నిర్వహిస్తున్న వివిధ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన ఆరోగ్య లక్ష్యాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా చిన్నారుల వ్యాక్సినేషన్ వందశాతం పూర్తి చేయాలని, క్షయ బాధితులకు అందాల్సిన ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ప్రక్రియలో ఎలాంటి జాప్యం సరికాదన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు అందించే వైద్యసేవల్లో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చూడాలని స్పష్టం చేశారు. ఆయన వెంట వైద్యాధికారి డా. భవాని, ఆరోగ్య సిబ్బంది ఉన్నారు.
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ‘మోడల్’ విద్యార్థులు
ఖిల్లాఘనపురం: పీఎంశ్రీ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు మండలంలోని తెలంగాణ మోడల్ పాఠశాల విద్యార్థులు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ ఉమాదేవి, పీఈటీ చందర్ బుధవారం తెలిపారు. ఇటీవల జిల్లాకేంద్రంలో నిర్వహించిన పీఎంశ్రీ జిల్లాస్థాయి పోటీల్లో విద్యార్థులు ఎల్.సాయికుమార్, పి.హారతి చక్కటి ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు చెప్పారు. ఎంపికై న విద్యార్థులను ప్రిన్సిపాల్, పీఈటీతో పాటు ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు.


