త్వరలో వనపర్తికి సీఎం రేవంత్‌రెడ్డి..
పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కోసం సీఎం రేవంత్‌రెడ్డి త్వరలో జిల్లాలో పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో సీఎంను కలిసి అభివృద్ధి పనులపై చర్చించినట్లు వివరించారు. అనంతరం ఫుట్‌పాత్‌లపై పండ్లు, పూలు విక్రయించుకుని జీవించే వారికితో భేటీ అయ్యారు. సమస్యలు తెలుసుకొని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని భరోసా ఇచ్చారు. సమావేశంలో పుర చైర్‌పర్సన్ మాధవి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బి.శ్రీనివాస్‌గౌడ్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతయ్య, జిల్లా ప్రధానకార్యదర్శి బ్రహ్మంచారి, పట్టణ అధ్యక్షుడు కదిరె రాములు తదితరులు పాల్గొన్నారు.
వనపర్తి: బీఆర్‌ఎస్ నాయకులు తమ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని.. ఇప్పుడు వారి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు తర్వాత ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ హయాంలో ఎన్ని ప్రాజెక్టులు నిర్మించారు? ఎన్ని పూర్తి చేశారు? పాలమూరు రైతులకు ఎంతమేర సాగునీరు అందించారన్న ప్రశ్నలకు ముందుగా సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి రైతులకు అందాల్సిన సాగునీటిని తన ఫాంహౌస్‌లకు మళ్లించుకున్నారన్నారని విమర్శించారు. వరి వేస్తే ఉరే అంటూ రైతులను భయపెట్టిన నాయకులు నేడు రైతుల సంక్షేమం గురించి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందని తెలిపారు. ఉద్యోగాల కోసం పోరాడిన నిరుద్యోగులను హమాలి పని చేసుకోవాలని సూచించిన నాయకులు ఇప్పుడు నిరుద్యోగుల పక్షాన మాట్లాడటం రాజకీయ అవకాశవాదానికి నిదర్శనమన్నారు. జిల్లాలో కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కరువు మండలాల గుర్తింపు ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. రైతులకు ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేస్తోందన్నారు.


