వీధికుక్కల నియంత్రణకు పటిష్ట చర్యలు | - | Sakshi
Sakshi News home page

వీధికుక్కల నియంత్రణకు పటిష్ట చర్యలు

Nov 4 2026 2:20 AM | Updated on Nov 4 2026 2:20 AM

వనపర్తి: జిల్లాలో వీధికుక్కలను తగ్గించడంతో పాటు కుక్కకాటు ఘటనలను నివారించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎన్‌.ఖీమ్యానాయక్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జిల్లా పంచాయతీ అధికారి, పుర కమిషనర్లు, ఇతర అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కుక్కకాటు ప్రమాదకరమైందని, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలన్నారు. బాధితులకు తక్షణ వైద్యం అందించేందుకు అన్ని ప్రభుత్వ వైద్యకేంద్రాలు, ఆస్పత్రుల్లో అవసరమైన యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌ అందుబాటులో ఉండేలా చూడాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. కుక్కలు అధికంగా సంచరించే ప్రాంతాలను గుర్తించి డాగ్‌ క్యాచర్ల ద్వారా బంధించి నిబంధనల ప్రకారం తరలించి అవసరమైన చికిత్స, వ్యాక్సినేషన్‌ అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వీధికుక్కల నిర్వహణ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. ముఖ్యంగా పాఠశాలల పరిసర ప్రాంతాల్లో కుక్కల సంచారంపై ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యార్థుల భద్రతకు సంబంధించి ఉపాధ్యాయులను అప్రమత్తం చేయాలని సూచించారు. కుక్కలు పాఠశాలల ఆవరణలోకి రాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, పశుసంవర్ధకశాఖ అధికారి వెంకటయ్యగౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement