వనపర్తి: భూ భారతి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని, భూదాన్ భూములను గుర్తించి వాటి వివరాలను పోర్టల్‌లో నమోదు చేసే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశించారు. మంగళవారం భూ భారతి, భూదాన్ భూముల గుర్తింపు, భూముల రీ–సర్వే తదితర అంశాలపై రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) లోకేష్‌కుమార్ హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్‌న్స్ నిర్వహించారు. ఈ వీసీకి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరం నుంచి అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్ హాజరయ్యారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. జిల్లాలో కొనసాగుతున్న భూముల రీ–సర్వే పనులను నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం వేగవంతం చేయాలని, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తూ త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిరుపతయ్య, డీఆర్‌ఓ రాంరెడ్డి, ఆర్డీఓ సుబ్రమణ్యం, సర్వే ఏడీ శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


