ఫిర్యాదుల పరిష్కారంలో పారదర్శకత తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదుల పరిష్కారంలో పారదర్శకత తప్పనిసరి

Nov 3 2026 2:15 AM | Updated on Nov 3 2026 2:15 AM

వనపర్తి: ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం తప్పనిసరిగా ఉండాలని ఎస్పీ డి.సునీతారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 15 మంది తమ సమస్యలపై ఫిర్యాదులు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రతి ఫిర్యాదును ఎస్పీ స్వయంగా పరిశీలించి.. సంబంధిత పోలీస్‌స్టేషన్‌ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రజావాణి ఫిర్యాదులను చట్టబద్ధంగా, పారదర్శకంగా, వేగవంతంగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

ప్రణాళికతో చదివితే ఉత్తమ ఫలితాలు

పాన్‌గల్‌: ప్రణాళికాబద్ధంగా చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని డీఐఈఓ నరేంద్రకుమార్‌ అన్నారు. సోమవారం పాన్‌గల్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులకు బ్యాగులు, బూట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. అంతకు ముందు కళాశాలలో ఆయన రికార్డులను పరిశీలించి.. అధ్యాపకులకు పలు సూచనలు చేశా రు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ తిరుమల్‌రావు, అధ్యాపక బృందం పాల్గొన్నారు.

నేడు విద్యుత్‌ సమస్యల పరిష్కార వేదిక

వనపర్తిటౌన్‌: జిల్లా కేంద్రంలోని విద్యుత్‌శాఖ డివిజనల్‌ కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేయనున్నట్లు ఎస్‌ఈ సి.తాతారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. విద్యుత్‌ బిల్లుల్లో సమస్యలు, సరఫరాలో అంతరాయాలు, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు తదితర సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం పొందవచ్చని తెలిపారు. జిల్లాలోని గృహ, వ్యాపార, పారిశ్రామిక, వ్యవసాయ విద్యుత్‌ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement